Monsoon Special Gadgets: భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుండగా, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం ఒక్కోసారి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. వర్షాన్ని నివారించడానికి కొన్ని గాడ్జెట్‌లు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటి ధర అందుబాటులో ఉంటుంది కూడా.
హెచ్ఎస్ఆర్ రెయిన్‌ప్రూఫ్ ఫిల్మ్ స్టిక్కర్
ఇది గాడ్జెట్ కానప్పటికీ వర్షాల సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వర్షంలో మీ కారు రియర్ వ్యూ మిర్రర్‌పై నీరు పడటం వలన మీరు స్పష్టంగా చూడలేరు. కానీ ఈ వాటర్‌ప్రూఫ్ యాంటీ ఫాగ్, యాంటీ స్టిక్కర్ సహాయంతో మీరు కారు నడుపుతున్నప్పుడు స్పష్టంగా చూడగలుగుతారు. ఈ స్టిక్కర్‌ను కొనుగోలు చేసే ముందు, ఇది మీ కారులో సరిగ్గా సరిపోతుందో లేదో చెక్ చేయండి.
కేసాలజీ వాటర్‌ప్రూఫ్ ఫోన్ పర్సు
ఈ వాటర్‌ప్రూఫ్ ఫోన్ పౌచ్‌లు మీ ఫోన్‌ను నీటి నుంచి రక్షిస్తాయి. ట్రిప్‌కి వెళ్లినా, వర్షంలో తడుస్తూ ఆఫీసుకు వెళ్తున్నా ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఈ వాటర్‌ప్రూఫ్ ఫోన్ పౌచ్‌ని అమెజాన్‌లో 51 శాతం తగ్గింపుతో రూ. 1605కి పొందవచ్చు.
Also Read: 2 జీబీ ప్యాక్ కోసం 200 పెట్టాల్సిందే- ప్రజల జేబులకు జియో, ఎయిర్‌టెల్ చిల్లు
ఆర్క్‌టికూల్ పోర్టబుల్ మినీ ఫ్యాన్
రుతుపవనాలు మండే వేడి నుండి ఉపశమనాన్ని ఇస్తాయి కానీ తేమను కూడా తెస్తాయి. దీన్ని నివారించడానికి, ఆర్కికూల్ పోర్టబుల్ మినీ ఫ్యాన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తేమ, చెమటను నివారించడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు. ఇంట్లో కరెంటు లేకపోతే మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు ఎక్కడైనా ట్రిప్‌కు వెళుతున్నట్లయితే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పోర్టబుల్ మినీ ఫ్యాన్ అమెజాన్‌లో 46 శాతం తగ్గింపుతో రూ.537కి అందుబాటులో ఉంది.
ఓవ్మే మినీ ఫోల్డింగ్ విండ్‌ప్రూఫ్ ట్రావెల్ అంబ్రెల్లా
ఇవన్నీ కాకుండా నీటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు అత్యంత ఉపయోగకరమైన వస్తువు ఏదైనా ఉందా ఉంటే, అది మినీ ఫోల్డింగ్ విండ్‌ప్రూఫ్ ట్రావెల్ గొడుగు. సాధారణంగా మార్కెట్‌లో లభించే గొడుగులు చాలా పొడవుగా, పెద్దవిగా ఉంటాయి. మీతో వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లడం కష్టం. ఈ సమస్యను తొలగించడానికి ఈ చిన్న ఫోల్డబుల్ గొడుగు మీ చిన్న బ్యాగ్‌లో కూడా సరిపోతుంది. ఈ గొడుగు అమెజాన్‌లో రూ.589కి అందుబాటులో ఉంది.
గ్రోజ్ పోర్టబుల్ పాకెట్ సైజ్ సీవోబీ ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్
క్యాంపింగ్‌కు వెళ్లేటప్పుడు అడవి, చీకటి గుండా వెళ్లాల్సి రావడం చాలాసార్లు కనిపిస్తుంది. ఆ సమయంలో ఎదురుగా ఉన్నవి కనిపించకపోతే అనుకోకుండా ప్రమాదాల్లో పడతాం. కాబట్టి అలాంటి వాటిని నివారించడానికి గ్రోజ్ లాంచ్ చేసిన ఈ పోర్టబుల్ ఫ్లాష్‌లైట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న సైజు వల్ల ఎక్కడికైనా తీసుకెళ్లడంలో ఇబ్బంది ఉండదు. దీంతో పాటు మీరు ఈ పోర్టబుల్ ఫ్లాష్‌లైట్‌ను బయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా పవర్ ఫెయిల్ అయిన సమయంలో ఉపయోగించవచ్చు.