Kamal Haasan Assets And Net Worth: ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటులలో కమల్ హాసన్ ఒకరు. 69 ఏళ్ల ఈ సీనియర్ నటుడు.. దాదాపు 6 దశాబ్దాలుగా ప్రేక్షకులను తన యాక్టింగ్‌తో అలరిస్తున్నారు. సౌత్ భాషలతో పాటు హిందీ, బెంగాలీలో కలిపి మొత్తం 230 సినిమాల్లో నటించారు కమల్. యాక్టర్‌గా మాత్రమే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్‌గా కూడా తన సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఆస్తుల విలువ రూ.450 కోట్లు ఉంటుందని సమాచారం. కమల్ హాసన్ వద్ద చాలా ఖరీదైన వస్తువులు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


లండన్‌లో లగ్జరీ మ్యాన్షన్..


చెన్నైలో కమల్ హాసన్‌కు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. దాంతో పాటు 25.59 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రస్తుతం దాని విలువ రూ.17.70 కోట్లు ఉంటుందని అంచనా. రూ.19.5 కోట్లు విలువ చేసే సౌకర్యవంతమైన ఫ్లాట్స్ ఉన్నాయి. వీటితో పాటు రూ. 92.05 కోట్లు విలువ చేసే కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అల్వార్‌పేటలో కమల్ హాసన్ పూర్వీకులకు సంబంధించిన ఒక ఇల్లు ఉంది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. లండన్‌లో కూడా కమల్ హాసన్‌కు ప్రాపర్టీస్ ఉన్నాయి. లండన్‌లో తనకు ఒక లగ్జరీ మ్యాన్షన్ ఉంది. దానికోసం ఆయన రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం.


కార్ల కలెక్షన్..


ఇతర సినీ సెలబ్రిటీలలాగానే కమల్ హాసన్‌కు కూడా లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. అందులో ప్రతీ కారు విలువ కోట్లలో ఉంటుంది. అందులో ఒకటి ‘లెక్సస్ LX 570’. ఈ కారు ధర దాదాపుగా రూ.2.82 కోట్లు. అధునాతమైన టెక్నాలజీతో తయారు చేసిన కార్లలో ఇది కూడా ఒకటి. దీంతో పాటు ఆయన దగ్గర ‘బీఎమ్‌డబ్ల్యూ 730LD’ కారు కూడా ఉంది. దీని విలువ దాదాపుగా రూ.1.35 కోట్లు ఉంటుందని సమాచారం. కార్లు మాత్రమే కాదు.. కమల్ హాసన్ దగ్గర ఉన్న చాలావరకు వస్తువుల ధర కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా ఉంటుంది. అందులో ఆయన వాచ్ కలెక్షన్ కూడా ఒకటి.


వాచ్‌లు అంటే ఇష్టం..


ఇప్పటికే కమల్ హాసన్ చాలా ఈవెంట్స్‌లో ‘కోరమ్ గోల్డెన్ బ్రిడ్జ్ క్లాసిక్ రోజ్ గోల్డ్’ వాచ్‌ను ధరించి కనిపించారు. దాని విలువ రూ.42 లక్షలు. అంతే కాకుండా ఆయన ఎవరికైనా కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ముందుగా వాచ్‌ను ఇవ్వడానికే ప్రిఫర్ చేస్తారు. అదే విధంగా తాను హీరోగా నటించిన ‘విక్రమ్’ మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించి సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాడు సూర్య. దీంతో కృతజ్ఞతగా తనకు రూ.47 లక్షలు విలువ చేసే రోలెక్స్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు కమల్. కేవలం సినిమాల్లో రెండు చేతులా సంపాదించడం మాత్రమే కాకుండా కమల్ హాసన్‌కు పలు బిజినెస్‌లు కూడా ఉన్నాయి. అందులో రియల్ ఎస్టేట్‌తో పాటు క్లాత్ బ్రాండ్ బిజినెస్ కూడా ఉంది.



Also Read: ‘భారతీయుడు 2’ సెన్సార్ రిపోర్ట్ - ఆ సన్నివేశం బ్లర్, ఆ డైలాగులూ తొలగింపు.. రన్ టైమ్ ఎంతంటే?