జెడ్‌టీఈ యాక్సాన్ 40 ప్రో స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు 100 మెగాపిక్సెల్ కెమెరాను అందించడం విశేషం. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు.
జెడ్‌టీఈ యాక్సాన్ 40 ప్రో ధర
ఈ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 2,998 యువాన్లుగా (సుమారు రూ.35,500) నిర్ణయించారు. క్రిస్టల్ మిస్ట్ బ్లూ, మ్యాజిక్ నైట్ బ్లాక్, స్టార్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
జెడ్‌టీఈ యాక్సాన్ 40 ప్రో స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 అంగుళాల కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైఓఎస్ 12 స్కిన్ ఆపరేటింగ్‌ను ఇందులో అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 100 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. వైఫై 6, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులను కూడా ఇందులో అందించారు.