Year Ender 2025: కొన్నేళ్ల కిందటి నుంచి స్మార్ట్‌ఫోన్‌లలో చాలా మార్పులు వస్తున్నాయి. కంపెనీలు పోటీపడి మరీ కొత్త మోడల్స్ మార్కెట్లోకి తెచ్చి సక్సెస్ అవుతున్నాయి. పెద్ద డిస్‌ప్లేతో కొన్ని ఫోన్లు సక్సెస్ కాగా, అధిక బ్యాటరీతో కొన్ని, స్టోరేజీ కెపాసిటీ, గేమింగ్ కోసం ఫాస్టెస్ట్ ప్రాసెసర్ వల్ల కొన్ని స్మార్ట్‌ఫోన్లు విక్రయాలలో రాణించాయి. ఓవైపు డిస్‌ప్లే పెరగడం, డౌన్‌లోడ్ చేసే యాప్స్, గేమింగ్ ఫీచర్ల కారణంగా పలు కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లలో జంబో బ్యాటరీ ప్యాక్‌లను ఇవ్వడం ప్రారంభించాయి. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో ఈ ఏడాది విడుదలైన 7,000mAh కంటే పెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్‌ల వివరాలపై ఓ లుక్కేయండి. 

Continues below advertisement

వివో టీ4 5జీ (Vivo T4 5G)

ఈ వివో ఫోన్ 6.77 క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో ప్రారంభించారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP (OIS) + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీని ముందు భాగంలో సెల్ఫీలు, వీడియోల కోసం 32MP సెన్సార్ ఇచ్చారు. ఈ ఫోన్ 7300 mAh బ్యాటరీతో వచ్చింది. వివో టీ4 5జీ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ. 24,999కి లిస్ట్ చేయబడింది.

Continues below advertisement

వన్‌ప్లస్ 15 (OnePlus 15)

ఈ ప్రీమియం ఫోన్ 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో ప్రారంభించబడింది. ఇందులో Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఉంది. ఇది 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో 32MP లెన్స్‌తో వస్తుంది. ఇది 7,300mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది, ఇది 120W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 72,999.

ఐక్యూ 15 (iQOO 15)

ఐక్యూ 15 స్మార్ట్ ఫోన్ కూడా తన ఫీచర్లతో OnePlus 15కి పోటీనిస్తుంది. iQOO 15లో 6.85 అంగుళాల M14 LEAD OLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది పవర్‌ఫుల్ Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో వచ్చింది. ఫోన్ వెనుక భాగంలో ఫొటోలు, వీడియోల కోసం 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. అయితే ఐక్యూ 15 ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 100W ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్ట్ చేసే 7,000mAh సిలికాన్ యానోడ్ బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంది. ఐక్యూ 15 ఫోన్ ప్రారంభ ధర రూ. 72,999గా ఉంది.

ప్రస్తుతం యువత సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తమకు తెలియకుండానే గంటలపాటు రీల్స్, షార్ట్స్ చూస్తూ కూర్చునే వారు కొందరైతే.. గంటల తరబడి ఆన్‌లైన్ గేమ్స్ ఆడే జెన్ జెడ్ యువత ఉన్నారు. ఆఫీసు పనిమీద బయటకు వెళ్లేవారు, ఎక్కువ గంటలపాటు ఫోన్‌లోనే బిజినెస్ చక్కబెట్టే వారికి ఇలాంటి బిగ్ బ్యాటరీ ఫోన్లతో ప్రయోజనం ఉంటుంది. ఎక్కువ mah బ్యాటరీ అనే ఫీచర్లతో కొన్ని కంపెనీలు మార్కెట్లో తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి.