WhatsApp New Update: Meta యాజమాన్యంలోని WhatsApp తన వినియోగదారుల కోసం చాలా ఉపయోగకరమైన ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇకపై మీ కాల్ అందుకోకపోతే, మీరు నేరుగా కాల్ స్క్రీన్ నుంచి వాయిస్ లేదా వీడియో సందేశాన్ని పంపవచ్చు. ఈ అప్‌డేట్ ప్రస్తుతం iPhone వినియోగదారులకు App Storeలో అందుబాటులో ఉంది. త్వరలో ఇతరులకు ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది.  

Continues below advertisement

మిస్డ్ కాల్‌లో తక్షణమే వాయిస్ మెసేజ్ పంపండి

WABetaInfo నివేదిక ప్రకారం, అతిపెద్ద మార్పు ఏమిటంటే, కాల్  రిసీవ్ చేసుకోనప్పుడు WhatsApp ఇప్పుడు ‘Record voice message’ ఎంపికను చూపుతుంది. మీరు అక్కడి నుంచే చిన్న ఆడియోను రికార్డ్ చేయవచ్చు, ఇది మిస్డ్ కాల్ నోటిఫికేషన్‌తో పాటు చాట్‌లో ఆటమేటిక్‌గా సెండ్‌ చేస్తుంది. మీరు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని త్వరగా చెప్పాలనుకున్నప్పుడు. టైప్ చేయడానికి సమయం వృథా చేయకూడదనుకున్నప్పుడు ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

వీడియో కాల్ మిస్ అయితే వీడియో సందేశాన్ని పంపండి

వీడియో కాల్‌ల కోసం కూడా WhatsApp ఇదే విధమైన సౌకర్యాన్ని జోడించింది. అవతలి వ్యక్తి మీ వీడియో కాల్ తీసుకోకపోతే, మీరు వెంటనే చిన్న వీడియో సందేశాన్ని రికార్డ్ చేయవచ్చు. ఇది సంభాషణను మరింత వ్యక్తిగతంగా చేస్తుంది, ఎందుకంటే మిస్డ్ కాల్ చూడటం కంటే, రిసీవర్ మీరు ఎందుకు కాల్ చేసారో చూపే విజువల్ మెసేజ్‌ను కూడా అందుకుంటాడు.

Continues below advertisement

కాల్‌ ట్యాబ్ కొత్త రూపం

WhatsApp కాల్‌ ట్యాబ్ డిజైన్‌ను కూడా పూర్తిగా మార్చింది. కొత్త ‘Unified call hub’ అన్ని కాల్ సంబంధిత కార్యకలాపాలను, కాంటాక్ట్‌లను యాక్సెస్ చేయడం, ఇష్టమైన వాటిని నిర్వహించడం లేదా కాల్ గ్రూప్‌లను సృష్టించడం వంటి వాటిని ఒకే విభాగంలో ఉంచుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఒకే ట్యాప్‌తో వన్-ఆన్-వన్ కాల్ లేదా 31 మంది వరకు గ్రూప్ కాల్‌లను సులభంగా ప్రారంభించవచ్చు. కొత్త లేఅవుట్ కాలింగ్‌ను వేగవంతం చేస్తుంది.  సులభతరం చేస్తుంది.

మొదటిసారి షెడ్యూల్ చేసిన కాల్ ఫీచర్

WhatsApp మరొక ముఖ్యమైన ఫీచర్‌ను జోడించింది, అదే కాల్ షెడ్యూలింగ్. ఇప్పుడు మీరు ముందుగా నిర్ణయించిన సమయం , తేదీలో వాయిస్ లేదా వీడియో కాల్‌ను షెడ్యూల్ చేయవచ్చు. ఆ ఈవెంట్ నోటిఫికేషన్‌ను చాట్‌లో పంపవచ్చు. పాల్గొనేవారికి కాల్ కోసం హెచ్చరిక వస్తుంది, దీని వలన ముఖ్యమైన సమావేశాలు, కుటుంబ సంభాషణలు లేదా గ్రూప్ చర్చలు మిస్ అవ్వవు.

త్వరలో అందరి ఫోన్‌లలో అప్‌డేట్

కంపెనీ ఈ అప్‌డేట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు నెమ్మదిగా అందిస్తోంది. పనితీరు స్థిరంగా ఉన్న వెంటనే, ఇది అన్ని డివైస్‌లలో అందుబాటులోకి వస్తుంది. కొత్త ఫీచర్లతో, WhatsApp కమ్యూనికేషన్‌ను మునుపటి కంటే వేగంగా, సులభంగా, మరింత సౌకర్యవంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.