Xiaomi 14 Civi Cost, Specifications And Cost In India: ప్ర‌ముఖ సెల్ ఫోన్ కంపెనీ షావోమీ కొత్త కొత్త ర‌కాల ఫోన్ల‌ను మార్కెట్ లోకి అందుబాటులోకి తెస్తోంది. దాంట్లో భాగంగానే షావోమీ 14 సిరీస్ లో ఇప్పుడు 147సివి ని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కి సంబంధించి అమ్మ‌కాల‌ను ఇండియాలో ప్రారంభించేసింది. జూన్ 12 నుంచి ఇది ఫ్లిప్ కార్ట్, ఎమ్ ఐ.కామ్, ఎమ్ ఐ హోమ్ స్టోర్స్ లో ఈ ఫోన్ కొనుగోలు చేయవ‌చ్చు. షావోమీ 14 సివి లైకా ట్యూన్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్, 50 ఎంపీ లైట్ ఫ్యూజెన్ 800 ఇమేజ్ సెన్సార్ తో వ‌స్తోంది. మ‌రి దీని ఫీచ‌ర్స్, ధ‌ర ఎంతో చూసేయండి. 


ధర ఎంతంటే? 


షావోమీ 14 సివి రేటు ఇండియాలో రూ.42,999 8 జీబీ + 56 జీబీ వేరియంట్. ఇక 12జీబీ + 512 జీబీ వర్ష‌న్ ధ‌ర వ‌చ్చేసి రూ.47,999 గా నిర్ణ‌యించారు. క్రూయిజ్ బ్లూ, మ‌ట్చా గ్రీన్, షాడో బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ప్ర‌స్తుతానికి ఆన్ లైన్ లో మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఈ ఫోన్.. జూన్ 20 నుంచి ఆఫ్ లైన్ రీటైల్ స్టోర్స్ లో అందుబాటులోకి వ‌స్తుంది. క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ లో మూడు నెల‌ల యూట్యూబ్ ప్రీమియ‌మ్ స‌బ్ స్క్రిప్ష‌న్ తో పాటు ఆరు నెల‌ల పాటు 100 జీబీ గూగుల్ వ‌స్తుంది. 


షావోమీ 14 సివిక్ డ్యూయెల్ సిమ్ ఫోన్. హైప‌ర్ ఓఎస్ ఇంట‌ర్ ఫేస్ బేస్ లో ఆండ్రాయిడ్ 14 మీద వ‌ర్క్ అవుతుంది. 6.55 ఇంచ్, 1.5కే క‌ర్వ్ AMOLED  డిస్ ప్టేతో వ‌స్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz  ట‌చ్ సాంప్లింగ్ రేట్. 446పీపీఐ పిక్స‌ల్ డెన్సీటీ, 3వేల నిట్స్ పీక్ బ్రైట్ నెస్ వ‌స్తుంది. HDR10+, డాల్బీ విజన్, గొరిల్లా గ్లాస్ విక్ట‌స్ 2 ప్రొట‌క్ష‌న్ తో స్క్రీన్ స‌పోర్ట్ వ‌స్తుంది. 4ఎన్ ఎన్ స్నాప్ డ్రాగ‌న్ 8ఎస్ జెన్3 ఎస్వోసీ మీద ర‌న్ అవుతుంది ఈ ఫోన్. 12 జీబీ  LPDDR5 RAM  అప్ టూ 512GB UFS 4.0 స్టోరేజ్ తో వ‌స్తుంది షావోమీ 14 సివి. 



ఈ ఫోన్ లో మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే?  డౌన్ స్పీడ్ పెరిగేందుకు, నెట్ వ‌ర్క్ క‌వ‌రేజ్ బాగా ఉండేందుకు ఉప‌యోగ‌ప‌డే T1 సిగ్న‌ల్ ఎన్ హాంచ్మెంట్ చిప్ ఫోన్ లోనే అమ‌ర్చి ఉంటుంది. దీని వ‌ల్ల‌నెట్ వ‌ర్క్ త‌క్కువ ఉన్న ప్లేస్ లో కూడా ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. మాములు క‌న్వెన్ష‌నల్ వేప‌ర్ కూలింగ్ సిస్టమ్ కంటే బాగా ప‌నిచేసే ఐస్ లూప్ కూడా ఉంది ఈ ఫోన్ లో. 


ఇక క‌మెరా ఆప్ష‌న్ చూస్తే ట్రిబుల్ రీర్ కెమెరా అమ‌ర్చారు. అవి కూడా సుమ్మీల‌క్స్ లైకా లెన్స్ తో ఉన్నాయి. సెల్ఫీ కెమెరాలు కూడా డ‌బుల్ కెమెరా ఇచ్చారు. అది కూడా 32 మెగా పిక్సెల్స్. 50 మెగా పిక్సెల్ లైట్ ఫ్యూజెన్ 800 ఇమేజ్ సెన్సార్ తో ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ ఏర్పారిచారు. దాంతో పాటు 25ఎమ్ ఎమ్ స‌మాన‌మైన ఫ‌క్ష‌క‌ల్ లెన్త్, 2x జూమ్ తో ఉన్న 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 120-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో క‌లిగి ఉంది. 


క‌నెక్టివిటీ ఆప్ష‌న్స్ విష‌యానికొస్తే.. షావోమీ 14 సివి 5జీ ఫోన్. వైఫై 6, ఎన్ ఎఫ్ సి, బ్లూ టూట్ 5.4, జీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, ఎన్ ఎఫ్ ఎస్ సి, యూఎస్ బి టైప్ - సితో వ‌స్తుంది. సెన్సార్స్ లో యాక్సిలరోమీటర్, యాంబియెంట్ లైట్ సెన్సార్, ఈ కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సాన‌ర్, ఐఆర్ బ్లాస‌ర్ట ఉన్నాయి. డాల్బీ అట్మాస్ స‌పోర్ట్ తో స్టీరియో స్పీక‌ర్స్, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, ఏఐ బ్యాక్డ్ ఫేస్ అన్ లాక్ సిస్ట‌మ్ కూడా ఉంది షావోమీ 14సివికి. 


Also Read: మాంచి కెమెరా ఫోన్ కావాలా? ఇవిగో ఈ ఫోన్లు ట్రై చెయ్యండి.. రూ.30 వేలకే అదిరిపోయే ఆప్షన్స్