షియోమీ 12 లైట్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు అజర్‌బైజాన్‌లో ప్రారంభం కానున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక లాంచ్ ఇంకా జరగాల్సి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా షియోమీ అజర్‌బైజాన్ వెబ్ సైట్‌లో లిస్ట్ అవ్వలేదు. ఈ ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అన్నీ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
షియోమీ అజర్‌బైజాన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. ఈ పోస్టు ప్రకారం ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లు జులై 8వ తేదీన ప్రారంభం కానున్నాయి. అయితే కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో దీనికి సంబంధించిన వివరాలు ఏమీ పేర్కొనలేదు.
షియోమీ 12 స్పెసిఫికేషన్లు, ధర
దీని ధరను 999 అజర్‌బైజానీ మనత్‌లుగా (మనదేశ కరెన్సీలో రూ.46,400) నిర్ణయించారు. బ్లాక్, పింక్, గ్రీన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.55 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్‌ను కూడా అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. షియోమీ 12ఎస్ సిరీస్ కూడా చైనాలో త్వరలో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో షియోమీ 12ఎస్, షియోమీ 12ఎస్ ప్రో, షియోమీ 12ఎస్ అల్ట్రా ఉండనున్నాయని సమాచారం.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!