మెటాకు చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ Whats App కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 నుంచి Apple, Samsung సహా ఎంపిక చేసిన స్మార్ట్‌ ఫోన్‌లకు వాట్సాప్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. గతంలో కూడా పలు ఫోన్లకు వాట్సాప్ సర్వీసులను నిలిపివేసింది. వాటిలో ఎక్కువగా వాడుకలో లేని ఫోన్లే ఉన్నాయి. అవన్నీ పాత ఆపరేటింగ్ సిస్టమ్ తోనే రన్ అవుతున్నాయి.   


50కి పైగా మోడల్స్‌లో వాట్సాప్ నిలిపివేత      


ప్రస్తుతం, Android వెర్షన్ 4.1 తర్వాతి ఫోన్లు, iOS 12తో నడిచే ఫోన్లు, KaiOS 2.5.0 సపోర్టుతో పని చేసే వెర్షన్ లకు మాత్రమే WhatsApp సపోర్టు చేస్తోంది. డిసెంబర్ 31 నుంచి ఆండ్రాయిడ్ 5.0 (లాలిపాప్) కంటే ముందు విడుదలైన వెర్షన్‌లలో నడుస్తున్న  ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌ లకు తమ సర్వీసులను నిలిపివేస్తోంది. iOS 10, 11లో నడుస్తున్న iPhoneలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. పలు నివేదికల ప్రకారం 50కి పైగా స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చే ఏడాది నుంచి కొత్త ఫీచర్లు,  సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా ఎలాంటి అప్‌డేట్స్ అందుకోలేవు. చివరికి,  ఈ స్మార్ట్‌ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయడం ఆపివేస్తుంది. ఈ జాబితాలో ఉన్న స్మార్ట్ ఫోన్లన్నీ చాలా వరకు పాత ఆపరేటింగ్ సిస్టమ్‌ ద్వారానే రన్ అవుతున్నాయి.


డిసెంబర్ 31 తర్వాత WhatsApp సపోర్టు చేయని స్మార్ట్ ఫోన్లు ఇవే:


Apple iPhone 5, Apple iPhone 5c, ఆర్కోస్ 53 ప్లాటినం, గ్రాండ్ S ఫ్లెక్స్ ZTE, గ్రాండ్ X క్వాడ్ V987 ZTE, HTC డిజైర్ 500, Huawei Ascend D, Huawei Ascend D1, Huawei Ascend D2, Huawei Ascend G740, Huawei Ascend Mate, Huawei Ascend P1, క్వాడ్ XL, Lenovo A820, LG ఎనాక్ట్, LG లూసిడ్ 2, LG Optimus 4X HD, LG ఆప్టిమస్ F3, LG Optimus F3Q, LG Optimus F5, LG ఆప్టిమస్ F6, LG Optimus F7, LG ఆప్టిమస్ L2 II,LG ఆప్టిమస్ L3 II, LG Optimus L3 II డ్యూయల్, LG Optimus L4 II, LG Optimus L4 II డ్యూయల్, LG Optimus L5, LG Optimus L5 డ్యూయల్, LG Optimus L5 II, LG Optimus L7, LG Optimus L7 II, LG Optimus L7 II డ్యూయల్, LG ఆప్టిమస్ నైట్రో HD, మెమో ZTE V956, Samsung Galaxy Ace 2, Samsung Galaxy కోర్, Samsung Galaxy S2, Samsung Galaxy S3 మినీ, Samsung Galaxy Trend II, Samsung Galaxy Trend Lite, Samsung Galaxy Xcover 2, సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్ ఎస్, సోనీ ఎక్స్‌పీరియా మీరో, సోనీ ఎక్స్‌పీరియా నియో ఎల్, వికో సింక్ ఫైవ్, వికో డార్క్‌నైట్ ZT.


Read Also: 2023 నాటికి అందుబాటులోకి 80 శాతం కొత్త 5G స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ కోసం రూ.76 వేల కోట్లు-ICEA