iPhone 16 Pro Max EMI : Apple iPhone కొనాలనే కల చంపుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఈజీగా కొనుక్కోవచ్చు. iPhone 16 Pro Max ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఖరీదు కచ్చితంగా ప్రీమియం కేటగిరీలో ఉంది. కానీ కొనడం మాత్రం కష్టం కాదు. ఈ ఫోన్ కోససం చాలా ఫైనాన్స్ కంపెనీలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల EMI సౌకర్యాలు కల్పిస్తున్నాయి. భారీగా డబ్బులు చెల్లించకుండానే తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే ఖరీదైన ఐఫోన్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుక్కోవడానికి ఎంత డౌన్‌పేమెంట్ చెల్లించాలి? దాని నెలవారీ వాయిదా (EMI) ఎంత అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం.
ధర ఎంత?
ముందు iPhone 16 Pro Max ధర గురించి మాట్లాడుకుందాం. iPhone 16 Pro Max ప్రారంభమైన తర్వాత భారత్‌లో దీని ధర దాదాపు 1,29,900గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది కేవలం బేస్ వేరియంట్ మాత్రమే. మెమొరీ పెరిగే కొద్దీ ధర కూడా మారుతూ ఉంటుంది. ధర ఎంత ఉన్నప్పటికీ సాధారణ వినియోగదారులు కూడా కొనక్కునే వెసులుబాటు ఫైనాన్స్ సంస్థలు కల్పిస్తున్నాయి. వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు EMI సౌకర్యం ద్వారా కొనుక్కోవచ్చు.
మీరు ఈ ఫోన్‌ను EMIలో కొనాలనుకుంటే, మీకు అనేక ఆప్షన్‌లు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు జీరో డౌన్‌పేమెంట్, నో-కాస్ట్ EMI ఎంపికను కూడా అందిస్తున్నాయి. అంటే, మీరు ఎటువంటి ముందస్తు చెల్లింపు చేయకుండానే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు . ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించడం ద్వారా అప్పు తీర్చేయొచ్చు. ఉదాహరణకు, మీరు 1,29,900 ధర కలిగిన iPhone 16 Pro Maxని 12 నెలల పాటు నో-కాస్ట్ EMIలో తీసుకుంటే మీరు నెలకు దాదాపు ₹10,800 నుంచి ₹11,000 మధ్య EMI చెల్లించాలి.
EMI ఎంత అవుతుంది?
మీరు కొంచెం డౌన్‌పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటే, మీ EMI మరింత తగ్గుతుంది. మీరు మొత్తం ధరలో 20 శాతం, అంటే దాదాపు ₹26,000 డౌన్‌పేమెంట్ చేస్తే, మిగిలిన ₹1,03,000పై మీ EMI తగ్గుతుంది. ఈ సందర్భంలో, 12 నెలల EMI దాదాపు ₹8,500 నుంచి ₹9,000 వరకు ఉంటుంది. అదేవిధంగా, మీరు 33% అంటే దాదాపు ₹43,000 వరకు డౌన్‌పేమెంట్ చేస్తే, EMI మరింత తగ్గి ₹6,500 నుంచి ₹7,000 మధ్యకి రావచ్చు, ముఖ్యంగా మీరు 16 నెలల ప్లాన్‌ను ఎంచుకుంటే ఇంత చెల్లించాల్సి ఉంటుంది.
ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఆఫర్‌లు
వీటికి Flipkart , Amazon వంటి కొన్ని ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు ప్రత్యేక ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లను కూడా అందిస్తాయి. ఇది మీ మొత్తం ఖర్చును తగ్గిస్తుంది. అలాగే, HDFC, ICICI, Axis వంటి అనేక బ్యాంకులు క్యాష్‌బ్యాక్ లేదా తక్షణ డిస్కౌంట్‌లను అందిస్తాయి, ఇది EMIపై ప్రభావం చూపుతుంది.
మొత్తంమీద, iPhone 16 Pro Max కొనడం ఇప్పుడు ధనవంతులకే పరిమితం కాలేదు. EMI పథకాలు డౌన్‌పేమెంట్ ఎంపికలు మధ్యతరగతి వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చాయి. సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా, కొంచెం తెలివిగా ఉండటం ద్వారా, ఈ ఖరీదైన ఫోన్‌ను కూడా మీ ఆర్థిక పరిస్థితిపై అదనపు భారం లేకుండా సులభమైన నెలవారీ వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు.