వివో కొత్త ఫోన్ చైనాలో లాంచ్ అయింది. అదే వివో వై77ఈ 5జీ. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


వివో వై77ఈ 5జీ ధర
ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 యువాన్లుగా (సుమారు రూ.20,000) ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. బ్లాక్, బ్లూ, పింక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


వివో వై77ఈ ఫీచర్లు
ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ ఉంది.


ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఈ ఫోన్‌లో అందించారు.


ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.


వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్‌ ఆగస్టు 17వ తేదీన మనదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని వివో అధికారికంగా ప్రకటించింది. మనదేశంలో వివో వీ25 సిరీస్‌లో మొదటగా లాంచ్ కానున్న ఫోన్ వివో వీ25 ప్రోనే. ఫ్లిప్‌కార్ట్, వివో ఈ-షాప్, వివో స్టోర్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. వివో వీ25 ప్రో మనదేశంలో ఆగస్టు 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో రెండు ఫోన్లు ఉండనున్నాయి. అవే వివో వీ25, వివో వీ25 ప్రో. ప్రస్తుతానికి వీటిలో వివో వీ25 ప్రో మాత్రమే విడుదల కానుంది.


ఈ స్మార్ట్ ఫోన్‌లో కలర్ ఛేంజింగ్ బ్యాక్ డిజైన్ ఉండనుందని వివో ఇప్పటికే ప్రకటించింది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించనున్నారు. వ్లాగింగ్, నైట్ వీడియోగ్రఫీ కోసం హైబ్రిడ్ వీడియో స్టెబిలేషన్ కూడా అందించారు.


మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4830 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను వివో వీ25 ప్రో సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది.


8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇక ధర విషయానికి వస్తే దీని ధర రూ.40 వేల నుంచి ప్రారంభం కానుంది. ఫోన్ ముందువైపు 32 మెగాపిక్సెల్ ఐ ఏఎఫ్ సెల్ఫీ కెమెరా ఉండనుంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!