వివో వై21జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది వివో వై-సిరీస్‌లో లాంచ్ అయింది. ఇందులో 4 జీబీ ర్యామ్ ఉంది. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో 6.51 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది.


వివో వై21జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.13,990గా నిర్ణయించారు. డైమండ్ గ్లో, మిడ్‌నైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన ఆఫ్ లైన్ సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆన్‌లైన్ సేల్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది.


వివో వై21జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 4 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరో 1 జీబీ పెంచుకోవచ్చు.


64 జీబీ స్టోరేజ్‌ను కూడా వివో ఇందులో అందించింది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. మీడియాటెక్ ఎంటీ6769 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా... బరువు 182 గ్రాములుగా ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ అపెర్చర్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


4జీ, వైఫై, బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లను ఇందులో అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?