Vivo X300 Series In India | చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo భారత మార్కెట్లో తన కొత్త X300 సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో Vivo X300, Vivo X300 Pro స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ సిరీస్‌ను ప్రత్యేకంగా ఫోటోలు, వీడియోగ్రఫీ కోసం ఫోన్ అవసరమైన కస్టమర్ల కోసం దీన్ని ప్రారంభించారు. ఈ సిరీస్‌తో పాటు Vivo టెలిఫోటో ఎక్స్‌టెండర్ కిట్‌ను కూడా విడుదల చేసింది. ఇది ఫోటోల కోసం మరింత జూమ్ కెపాసిటీ అందిస్తుంది. దీని ధర రూ. 18,999గా నిర్ణయించారు. సిరీస్‌లో విడుదలైన ఫోన్‌ల ఫీచర్లు, ధర మొదలైన వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Continues below advertisement

Vivo X300 Pro

ఇది ఈ సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్ గా చెప్పవచ్చు. ఇది 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఎండలో కూడా స్పష్టమైన వ్యూ మీకు అందిస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 16GB RAM, 512GB స్టోరేజీతో జత చేశారు. కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఇది 50MP ప్రైమరీ లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 200MP పెరిస్కోప్ సెన్సార్‌ను కలిగి ఉంది. కంపెనీ ఈ ఫోన్‌లో రెండు ప్రత్యేకమైన ఇమేజింగ్ చిప్‌లను ఉపయోగించింది. ముందు భాగంలో 50MP కెమెరా ఇవ్వగా, ఈ ఫోన్ 6,510mAh బ్యాటరీతో వస్తుంది.

Continues below advertisement

Vivo X300

 వివో సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్ 6.3 అంగుళాల స్క్రీన్‌తో వచ్చింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంది. దీని వెనుక భాగంలో 200MP ప్రైమరీ కెమెరా ఇచ్చారు. 50MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో కూడా 50MP కెమెరా ఉంది. ప్రో మోడల్‌తో పోలిస్తే ఇది 6,040mAh చిన్న బ్యాటరీని కలిగి ఉంది. 

వివో ఫోన్ల ధర ఎంత?

Vivo ఈ సిరీస్‌ను ప్రీమియం కేటగిరీలో మార్కెట్లోకి విడుదల చేసింది. X300 ప్రారంభ ధర రూ. 75,999, అయితే X300 Pro ధర రూ. 1,09,999గా ఉంది. డిసెంబర్ 10 నుంచి రెండు ఫోన్‌ల అమ్మకాలు ప్రారంభమవుతాయి. 

ఎవరితో పోటీ?

ప్రో మోడల్ దాని ధర కారణంగా Samsung కంపెనీ, Oppo మోడ్రన్ కెమెరా, బెస్ట్ పనితీరు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది. అయితే స్టాండర్డ్ మోడల్ OnePlus 15, IQOO 15 వంటి మోడల్‌లతో పోటీపడుతుంది. OnePlus 15 Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, 7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ కెమెరాతోొ వచ్చింది. అదేవిధంగా IQOO 15 (ఐక్యూ 15) కూడా Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌తో ప్రారంభించారు. ఈ ఐక్యూ ఫోన్ 7,000mAh సిలికాన్-ఆనోడ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.