వివో ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసిన వివో వీ23ఈ 5జీ స్మార్ట్ సమ్మర్ స్పెషల్ ఆఫర్‌ను అందించారు. దీంతో ఈ ఫోన్‌పై రూ.8,000 వరకు తగ్గింపు లభించనుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. దీన్ని ఆండ్రాయిడ్ 12కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
వివో వీ23ఈ 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ఎమ్మార్పీ రూ.28,990 కాగా... రూ.25,990కే విక్రయిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, వన్ కార్డు, ఎస్‌బీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.ఐదు వేలు క్యాష్ బ్యాక్ లభించనుంది. అంటే రూ.20,990కే ఈ ఫోన్ దక్కించుకోవచ్చన్న మాట.
వివో వీ23ఈ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వివో వీ23ఈ 5జీ పనిచేయనుంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మరింత పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4050 ఎంఏహెచ్‌గా ఉంది. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై వివో వీ23ఈ 5జీ పనిచేయనుంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 44 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!