వివో వీ25 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఆగస్టులో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఏకంగా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ ఫోన్‌ను ట్వీట్ చేయడం విశేషం. విరాట్ కోహ్లీ తాజాగా షేర్ చేసిన ట్వీట్‌లో “My favourite shade of blue” అని క్యాప్షన్ పెట్టారు. ఇందులో స్మార్ట్ ఫోన్ బ్లూ కలర్‌లో ఉంది. దీని లుక్‌ను బట్టి చూస్తే డిజైన్ వివో ఎస్15 ప్రో తరహాలో ఉందనుకోవచ్చు.


దీన్ని బట్టి ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో లాంచ్ అయిన వివో ఎస్15 ప్రోకు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుందని చెప్పవచ్చు. విరాట్ పట్టుకున్న ఫోన్ బ్లూ కలర్‌లో ఉంది. కాబట్టి ఈ ఫోన్ బ్లూ కలర్ ఆప్షన్‌లో ఉండే అవకాశం ఉంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌తో ఈ ఫోన్ రానుందని వార్తలు వస్తున్నాయి.


ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే... డైమండ్ బ్లాక్, సన్‌రైజ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వివో వీ-సిరీస్ ఫోన్లు భారతదేశంలో కూడా చాలా ఫేమస్ కాబట్టి ఇక్క కూడా వివో వీ25 లాంచ్ కానుంది. దీని ధర మనదేశంలో రూ.30 వేల రేంజ్‌లో ఉండనుందని సమాచారం. డైమండ్ బ్లాక్, సన్‌రైజ్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది.


వివో వీ25 సిరీస్‌లో మొత్తం నాలుగు ఫోన్లు ఉండే అవకాశం ఉంది. వివో వీ25, వివో వీ25 ప్రో, వివో వీ25ఈ, వివో వీ25ఈ సిరీస్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ 5జీని కూడా సపోర్ట్ చేయనున్నాయి. వివో వీ25ఈలో 4జీ వేరియంట్ కూడా రానుందని తెలుస్తోంది.