ఇన్‌ఫీనిక్స్ జూలై 29వ తేదీన భారతదేశంలో స్మార్ట్ 6 ప్లస్ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన Infinix Smart 6కి తర్వాతి వెర్షన్‌గా వస్తుంది. స్మార్ట్ 6 ప్లస్ ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా మొదట కనిపించింది. ఇది స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను మాత్రమే కాకుండా దాని కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా రివీల్ చేసింది.


ఫ్లిప్‌కార్ట్ జాబితా ప్రకారం... ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 6 ప్లస్ మరో రెండు రోజుల్లో లాంచ్ కానుంది. ఫ్లాట్ సైడెడ్ డిజైన్‌తో పాటు డాట్ నాచ్ డిస్‌ప్లేను కూడా అందించారు. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. పవర్, వాల్యూమ్ బటన్‌లు ఫోన్ కుడి వైపున ఉన్నాయి. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.


స్పెక్స్ విషయానికొస్తే... ఈ హ్యాండ్‌సెట్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న 6.82-అంగుళాల డాట్ నాచ్ డిస్‌ప్లేను అందించనున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండనుంది. 3 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో పాటు 3 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఉంటుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మిగతా ఫీచర్లు తెలియరాలేదు.


ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే కొత్త 3డీ వేపర్ క్లౌడ్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ క్రియేటివ్ సొల్యూషన్ సీపీయూ ఫ్రీక్వెన్సీతో పాటు, ఫ్రేమ్ రేట్ డ్రాప్స్, ఫ్రోజెన్ స్క్రీన్లు వంటి అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడే కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.


ఈ కొత్త ఇన్‌ఫీనిక్స్ వేపర్ క్లౌడ్ ఛాంబర్ టెక్నాలజీ చైనా నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ధృవీకరించబడింది. సాంప్రదాయ వీసీ డిజైన్‌తో పోల్చినప్పుడు.. 3డీ వేపర్ క్లౌడ్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ చాలా ముందు ఉంటుంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!