Cheapest Prepaid Plans Without Data: డేటా లేకుండా కేవలం కాల్స్, మెసేజ్‌ల కోసం Airtel, Jio, Vi, BSNL అందించే ప్లాన్‌లలో ఏది బెటర్?

Best Mobile Recharge Plans: దేశంలో చాలా మందికి డేటా లేని సేవలు అవసరం అవుతాయని అలాంటి వారికోసం రీఛార్జ్‌ ప్లాన్‌లు ఉండాలని ఈ మధ్యే టెలికాం కంపెనీలకు ట్రాయ్ సూచించింది. 

Continues below advertisement

Cheapest Prepaid Plans Without Data: స్మార్ట్ ఫోన్‌ల వాడకం ఎంతలా పెరిగినప్పటికీ డేటా వినియోగించని వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారు ఫోన్ రీఛార్జ్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే టైంలో ఫీచర్‌ ఫోన్‌లు కలిగి ఉన్న వాళ్లు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఒక ప్రధానమైన సిమ్‌ కలిగి ఉండి అవసరార్థం రెండో సిమ్‌ వాడుతున్న వాళ్లకు ఈ సమస్య ఉంది. అందుకే వీటికి పరిష్కారంగా టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక సూచనలు చేసింది. ఆసూచనలతో టెలికాం కంపెనీలు డేటా లేని ప్లాన్‌లు తీసుకొచ్చాయి. 

Continues below advertisement

దేశంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం డేటా లేకుండా సరసమైన ప్లాన్‌లను ప్రారంభించాలని చాలా రోజుల క్రితమే టెలికాం కంపెనీలైన Airtel, Jio, Vodafone Idea (Vi), BSNLలను ఆదేశించింది. దీంతో ఆయా కంపెనీలు వాయిస్-ఓన్లీ ప్లాన్‌లు ప్రవేశపెట్టాయి.

ఈ ప్లాన్‌లను TRAI సమీక్షించింది. తక్కువ ధరకు మరిన్ని సౌకర్యాలను అందించాలని కంపెనీలకు సూచించింది. ఆ తర్వాత కంపెనీలు తమ ప్లాన్‌లలో కొన్ని మార్పులు చేశాయి. ఇప్పుడు వీటిలో చౌకైన ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

Also Read: రూ. 25వేల స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 7000లకే- Vivo స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్

Airtel తన 84 రోజుల ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 900 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ ధర రూ. 469. దీనికి జీఎస్టీ అదనంగా చెల్లించాలి. Jio 84 రోజుల ప్లాన్ రూ. 448కి అందిస్తుంది. దీనిలో అపరిమిత కాలింగ్, 1,000 SMSలు అందుబాటులో ఉన్నాయి. Vodafone Idea (Vi) ఈ ప్లాన్ రూ. 470కి అందుబాటులో ఉంది. దీనిలో 900 SMS, అపరిమిత కాలింగ్ సౌకర్యం ఇచ్చింది. 

ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఈ విషయంలో అత్యంత చౌకైన ప్లాన్ తీసుకొచ్చింది. BSNL డేటా-రహిత ప్లాన్ రూ. 439కి అందుబాటులో ఉంది, ఇందులో అపరిమిత కాలింగ్, 300 SMSలు అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా దీని వాలిడిటీ 90 రోజులుగా నిర్దారించింది. అత్యంత సరసమైన ఎంపికను పరిశీలిస్తే BSNL రూ. 439 ప్లాన్ చౌకైనది ఎక్కువ కాలం చెల్లుబాటుతో వస్తుంది.

వన్‌ ఇయర్ ప్లాన్‌లు పరిశీలిస్తే, ఎయిర్‌టెల్ రూ. 1,849కి అపరిమిత కాలింగ్ 3,600 SMS సౌకర్యాన్ని అందిస్తుంది. Jio తన ప్లాన్ ధర రూ. 1,748గా నిర్దారించింది. ఇది 336 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. ఇది కూడా అపరిమిత కాలింగ్‌తోపాటు 3,600 SMSలు అందిస్తుంది. Vodafone Idea (Vi) ప్లాన్ కూడా 1,849 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇది 365 రోజుల పాటు అపరిమిత కాలింగ్, 3,600 SMSలను అందిస్తుంది.

BSNLకి 365-రోజుల వాయిస్-ఓన్లీ ప్లాన్ లేదు. కానీ 365-రోజుల చెల్లుబాటుతో రూ. 1,198కి ప్లాన్‌ ఒకటి ఉంది. 84 రోజుల చౌకైన ప్లాన్‌ను పరిశీలిస్తే BSNL యొక్క రూ. 439 ప్లాన్ ఉత్తమ ఎంపిక. ఎందుకంటే ఇది ఇతర కంపెనీలతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుంది. అదే సమయంలో Jio రూ. 1,748 ప్లాన్ వార్షిక ప్లాన్‌లలో చౌవకైంది. దీని వాలిడిటీ 336 రోజులే. Airtel, Vi ప్లాన్‌లు 365 రోజులు ఉంటాయి. మీకు పూర్తి సంవత్సరం చెల్లుబాటు కావాలంటే, Airtel, Vi రూ.1,849 ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

Also Read: బెస్ట్ లైట్ వెయిట్ ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా - ఐతే ఇక్కడ ఓ లుక్కేయండి

Continues below advertisement