New Smartphones in June: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది చాలా మంచి టైం. జూన్ మొదటి వారం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ చాలా  యాక్టివ్‌గా  ఉండబోతోంది. Motorola, Alcatel, Tecno వంటి ప్రముఖ బ్రాండ్‌లు తమ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు విక్రయానికి సిద్ధమవుతోంది.  ఏ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది. వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

Motorola Razr 60, ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్‌కు కొత్త నిర్వచనం

Motorolaలో బాగా పాపులర్ అయిన ఫోల్డబుల్ సిరీస్ ఫోన్‌లలో కొత్త వెర్షన్‌ను Razr 60 పేరుతో మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. దీని అమ్మకాలు జూన్ 4, 2025 నుంచి Motorola అధికారిక వెబ్‌సైట్, Flipkartలో ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ అద్భుతమైన డిజైన్‌తోపాటు, పవర్‌ఫుల్‌ ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా, అధునాతన డిస్ప్లే టెక్నాలజీని కలిగి ఉంటుంది. Motorola Razr 60 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. ఇది ప్రీమియం సెగ్మెంట్‌లో Samsung Z Flipకి గట్టి పోటీని ఇస్తుందని భావిస్తున్నారు.

Alcatel V3 Series 5G అమ్మకాలు జూన్ 2 నుంచి

Alcatel కూడా ఇటీవలే భారతీయ మార్కెట్‌లో తిరిగి వచ్చి తన కొత్త V3 Series 5Gని ప్రారంభించింది. ఈ సిరీస్‌లో మూడు మోడళ్లు ఉన్నాయి, Alcatel V3 Classic 5G, V3 Pro, V3 Ultra. ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జూన్ 2, 2025 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ధర విషయానికొస్తే, ఈ సిరీస్ బడ్జెట్ నుంచి మిడ్-రేంజ్ వినియోగదారుల కోసం రూపొందించారు.  వీటి ప్రారంభ ధర ₹12,999 నుంచి ₹21,999 వరకు ఉంటుంది. చౌక ధరలో 5G అనుభవాన్ని పొందాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

Tecno Pova Curve 5G అమ్మకాలు, ధర

Tecno తాజా స్మార్ట్‌ఫోన్ Pova Curve 5G కూడా ఈ వారంలో అమ్మకాలు ప్రారంభించనుంది. దీని అమ్మకాలు జూన్ 5, 2025 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి. వినియోగదారులు దీన్ని Tecno అధికారిక వెబ్‌సైట్, Flipkart నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రత్యేకంగా మెరుగైన పనితీరు, ఎక్కువ బ్యాటరీ లైఫ్, కర్వ్డ్ డిస్ప్లే కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. Tecno Pova Curve 5G ధర ₹15,999 నుంచి ₹16,999 వరకు ఉంటుంది.