Instagram: ఫొటో, వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఇన్‌స్ట్రాగ్రామ్‌ తాజాగా మరో కొత్త వెసులుబాటు ఇన్‌స్టాగ్రామ్‌. ఇప్పటి వరకు యూజర్లు తమ ఫొటోలను పోస్టు చేయాలంటే 1:1 స్క్వేర్‌ లేదా 4:5 రెక్టాంగిల్‌ ఫార్మాట్‌లోనే వీడియోలు, ఫొటోలు పోస్టు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మరో వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇకపై 3:4 యాస్పెక్ట్ రేషియోలో ఫొటోలను పోస్టు చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ అడమ్‌ మోస్సెరి సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇకపై ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 3:4 యాస్పెక్ట్‌ రేషియోలో ఫొటోలను నేటివ్‌గా ఫోటోలు- అంటే ప్రతి ఫోన్ కెమెరా డిఫాల్ట్‌గా తీసే పార్మాట్‌- సపోర్ట్‌ చేస్తుంది. మీరు 3:4 ఫొటోను అప్‌లోడ్ చేస్తే అది మీ కెమెరాలో కనిపించినట్టే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కనిపిస్తుంది. అని మోస్సెరీ తెలిపారు. 

Continues below advertisement

క్రాప్ చేయాల్సి అవసరం లేదుఇంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్టు చేయాలంటే వాటిని తప్పనిసరిగా  స్క్వేర్‌ లేదా 4:5 ఫార్మాట్‌కు క్రాప్ చేయాల్సి వచ్చిది. ఇప్పుడు 3:4 ఫార్మాట్‌తో యూజర్లు తమ ఫొటోలను ెలాంటి మార్పులు చేయకుండా, ఒరిజినల్‌ డైమెన్షన్స్‌లోనే పోస్టు చేయవచ్చు. ఒకే ఫొటో అయినా మల్టిపుల్ ఇమేజ్‌ అయినా, ఇప్పుడు అవి నేటివ్‌ వర్టికల్‌ ఫార్మాట్‌లోనే డిస్‌ప్లే అవుతాయి. 

వెర్టికల్ కంటెంట్‌కు మరింత అనుకూలంరీల్స్, ఫుల్ స్క్రీన్‌ స్టోరీస్ వంటివి వచ్చిన తర్వాత ఫార్మాట్‌ కంటెంట్‌కు డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ కూడా తన ప్రొఫైల్‌ గ్రిడ్‌ను మారుస్తూ, పోస్టులకు స్క్వేర్ కాకుండా రెక్టాంగులరర్‌ ప్రివ్యూలు చూపిస్తోంది. ఇప్పుడు 3:4 ఫార్మాట్‌ రావడంతో, ఫొటోగ్రాఫర్లు తమ ఫొటోలను మరింత నేచురల్‌గా, మొబైల్‌ స్క్రీన్‌కు అనుగుణంగా ప్రదర్శించుకోవచ్చు. 

Continues below advertisement

మొబైల్ ఫొటోగ్రాఫర్‌కు అనుకూలంఈ అప్‌డేట్‌ వల్ల సాధారణ యూజర్లు, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లు అందరూ తమ మొబైల్‌ ఫొటోలు హై క్వాలిటీ, ఒరిజినల్‌ ఫార్మాట్‌లో షేర్‌ చేయవచ్చు. ఫాలోవర్లకు కూడా మరింత అందంగా, అసలైన ఫొటో అనుభూతి లభిస్తుంది. 

3:4 ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?

  • మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్ చేయండి 
  • 3:4 ఫార్మాట్‌లో తీసిన ఫొటోను అప్‌లోడ్ చేయండి
  • ఇన్‌స్టాగ్రామ్‌ మీ ఫొటోను అదే ఫార్మాట్‌లో ప్రివ్యూలో, ఫీడ్‌లో చూపిస్తుంది. 
  • ఇకపై మాన్యువల్‌గా క్రాప్‌ చేయాల్సిన అవసరం లేదు.

ఇన్‌స్టాగ్రామ్‌ తాజా అప్‌డేట్‌ 3:4 ఫోటో ఫార్మాట్‌కు పూర్తి సపోర్ట్‌ వచ్చింది. యూజర్లు తమ మొబైల్‌ ఫొటోలను అసలైన డైమెన్షన్స్‌లో, ఎలాంటి మార్పులు లేకుండా పోస్ట్ చేయొచ్చు. ఇది ఫొటోగ్రాఫర్లకు, కంటెంట్‌ క్రయేటర్లకు నిజంగా సూపర్ న్యూస్‌.  

 క్రియేటివ్ ఫ్రీడమ్‌కు మార్గం ఈ మార్పుతో ఫొటోగ్రాఫర్లు తమ క్రియేటివిటీని మరింత స్వేచ్చగా ప్రదర్శించుకోవచ్చు. ఫొటోలో ఉన్న అసలైన కాంపోజిషన్, ఆర్టిస్టిక్‌ టచ్, ఫ్రేమింగ్‌ అని సెట్  చేసుకోవచ్చు. క్రియేటర్లకు ఇది ఒక పెద్ద ఊరట. ఇకపై ఫొటోను పోస్టు చేయాలంటి ఎడిటింగ్‌, క్రాప్‌, రీసైజ్‌ వంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. 

యూజర్‌లకు సరికొత్త అనుభూతి 

ఈ ఫీచర్‌తో యూజర్‌ల అనుభవం మరింత మెరుగు అవుతుంది. ఫీడ్‌లో స్క్రోల్ చేస్తుంటే, ఫొటోలు పూర్తిస్థాయిలో అసలైన రూపంలో కనిపిస్తాయి. ఇది ఫాలోవర్లకు కూడ కొత్త అనుభూతిని ఇస్తుంది.