Upcoming Smartphones in 2023: వచ్చే సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పలు మొబైల్ ఫోన్‌లను పరిచయం చేయబోతున్నాయి. కొత్త సంవత్సరంలో బడ్జెట్ రేంజ్, మిడ్‌రేంజ్, ప్రీమియం విభాగాలలో అనేక మొబైల్ ఫోన్‌లు విడుదల కానున్నాయి. కొత్త సంవత్సరంలో మీ కోసం ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఏ మొబైల్ ఫోన్‌లను విడుదల చేయబోతున్నారు. వాటిలో మీకు ఎలాంటి ఫీచర్లు లభిస్తాయో తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ తన స్మార్ట్‌ఫోన్‌లో బలమైన బ్యాటరీ, అద్భుతమైన కెమెరా, మంచి మెమరీ, ప్రత్యేకమైన డిజైన్ ఉండేలా ఉండాలని కోరుకుంటాడు. అటువంటి పరిస్థితిలో కొత్త సంవత్సరంలో మీకు ఏది సూటయ్యే ఫోన్ అని తెలుసుకోండి. వచ్చే సంవత్సరం లాంచ్ కానున్న ఫోన్లు ఇవే.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్
దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ తన ఎస్23 సిరీస్‌ని ఫిబ్రవరిలో ఆవిష్కరించవచ్చు. ఈ సిరీస్‌లో కంపెనీ మూడు స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. మొదటిది Samsung Galaxy S23, రెండోది Samsung Galaxy S23 Plus, మూడోది Samsung Galaxy s20 Ultra. Samsung స్మార్ట్‌ఫోన్‌లు Android 13, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో రానున్నాయి. 5000mah శక్తివంతమైన బ్యాటరీ, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానున్నాయి.


వన్‌ప్లస్ 11 5జీ
వన్‌ప్లస్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు శుభవార్త. కంపెనీ కొత్త సంవత్సరంలో OnePlus 11 5జీని ప్రారంభించబోతోంది. ఈ ఫోన్ ఫిబ్రవరిలో భారతదేశంలో లాంచ్ కానుందని సమాచారం. అయితే చైనాలో ఇది జనవరి 4వ తేదీన లాంచ్ కానుంది. ఈ మొబైల్ ఫోన్‌లో సర్క్యులర్ కెమెరా ఉండనుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించనున్నారు. OnePlus 11 5G ధర దాదాపు రూ.70,000 ఉండవచ్చు. లాంచ్ చేసిన తర్వాతే కచ్చితమైన సమాచారం వెల్లడవుతుంది.


నథింగ్ ఫోన్ 2 కూడా...
నథింగ్ ఫోన్ 1 ఈ సంవత్సరం చాలా వరకు వార్తల్లో ఉంది. ప్రజలు ఈ ట్రాన్స్‌పరెంట్ ఫోన్‌ను బాగా ఇష్టపడ్డారు. ఇప్పుడు కంపెనీ కొత్త సంవత్సరంలో నథింగ్ ఫోన్ టూని లాంచ్ చేయవచ్చు. ఈ మొబైల్ ఫోన్ ధర దాదాపు రూ.40,000 వరకు ఉంటుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఇందులో ఉంది. నథింగ్ ఫోన్ 2లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది.


గూగుల్ పిక్సెల్ 7ఏ, 8
Google స్మార్ట్‌ఫోన్‌లు మంచి కెమెరా నాణ్యత, ట్రూ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ల కోసం ప్రజలలో మంచి పేరు పొందాయి. కంపెనీ కొత్త సంవత్సరంలో Google Pixel 7A, 8ని లాంచ్ చేయవచ్చు. Google Pixel యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌లో HDR ప్లస్ ఫోటోగ్రఫీ సపోర్ట్ ఉండవచ్చు.


ఐఫోన్ 15
కొత్త సంవత్సరంలో యాపిల్ ఐఫోన్ 15ను కూడా విడుదల చేయనుంది. ఈ మొబైల్ ఫోన్‌లో ఉండబోయే అత్యంత ప్రత్యేకమైన విషయం టైప్ సి ఛార్జింగ్. వాస్తవానికి యూరోపియన్ యూనియన్ నిర్ణయం తర్వాత, స్మార్ట్‌ఫోన్‌లలో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను అందించడం మొబైల్ కంపెనీలకు తప్పనిసరి అయింది. అటువంటి పరిస్థితిలో ఐఫోన్ 15 గొప్ప ఫీచర్లతో పాటు టైప్ సి ఛార్జింగ్‌తో రావచ్చు. అయితే టైప్-సి పోర్ట్ రావడానికి కొంత సమయం పడుతుందని కొందరు టెక్ నిపుణులు భావిస్తున్నారు.


ఈ స్మార్ట్ ఫోన్లు కూడా
ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు Vivo x90 Pro, Xiaomi 13 Pro, IQOO 11 pro, Jio స్మార్ట్‌ఫోన్‌లను కూడా కొత్త సంవత్సరంలో ప్రారంభించవచ్చు.