టెక్నో పోవా నియో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ మనదేశంలో వచ్చేవారం ప్రారంభం కానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఏకంగా 13 5జీ బ్యాండ్లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
టెక్నో పోవా నియో 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.15,499గా నిర్ణయించారు. సాఫైర్ బ్లాక్, స్ప్రింట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
టెక్నో పోవా నియో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీటీపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ 8.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో పోవా నియో 5జీ రన్ అవుతుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ లెన్స్, క్వాడ్ ఫ్లాష్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండనుంది. మెమొరీ ఫ్యూజన్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరో 3 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీని ఈ ఫోన్‌లో అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డీటీఎస్ ఆడియో టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఫోన్ పక్కన భాగంలో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?