అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ శుక్రవారం ప్రారంభం అయింది. ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ ప్రారంభం అయింది. ఈ సేల్‌లో పాపులర్ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లను అందించారు. దీపావళి వచ్చే నెల 24వ తేదీన ఉంది కాబట్టి ఈ సేల్ దాదాపు ఒక నెల పాటు జరిగే అవకాశం ఉంది.


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ఇవే


శాంసంగ్ గెలాక్సీ ఎం13
సేల్ ధర: రూ.9,499 | ఎమ్మార్పీ: రూ.14,999
మీకు ఎక్కువ ఖర్చు కాకుండా ఈ సేల్‌లో మంచి స్మార్ ఫోన్ కావాలంటే శాంసంగ్ గెలాక్సీ ఎం13 మంచి ఆప్షన్. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.


శాంసంగ్ గెలాక్సీ ఎం13 కొనుగోలు చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి


వన్‌ప్లస్ 10ఆర్ 5జీ
సేల్ ధర: రూ.32,999 | ఎమ్మార్పీ: రూ.38,999


మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. మిడ్ రేంజ్ ఫోన్లలో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


వన్‌ప్లస్ 10ఆర్ 5జీ కొనుగోలు చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఐఫోన్ 13 ప్రో
సేల్ ధర: రూ.1,00,900 | ఎమ్మార్పీ: రూ.1,19,000


ఇందులో ఏ15 బయోనిక్ చిప్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ప్రత్యేకమైన సినిమాటిక్ మోడ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. అవసరం అయినప్పుడు ఫోకస్‌ను ఆటోమేటిక్‌గా ఒక ఆబ్జెక్ట్ నుంచి మరో ఆబ్జెక్ట్ మీదకు షిప్ట్ చేస్తుంది. ఐవోఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ వచ్చింది. అయితే ఐవోఎస్ 16కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఇందులో ఉంది.


ఐఫోన్ 13 ప్రో కొనుగోలు చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి


రెడ్‌మీ నోట్ 11 ప్రో
సేల్ ధర: రూ.12,099 | ఎమ్మార్పీ: రూ.17,999


రెడ్‌మీ నోట్ 11 స్మార్ట్ ఫోన్‌లో 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. దీని కొనుగోలుపై రెండు నెలల యూట్యూబ్ ప్రీమియం కూడా లభించనుంది.


రెడ్‌మీ నోట్ 11 ప్రో కొనుగోలు చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఐకూ జెడ్6 ప్రో 5జీ
సేల్ ధర: రూ.20,999 | ఎమ్మార్పీ: రూ.27,999


ఇందులో కూడా 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన కెమెరాగా అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్న డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. 


ఐకూ జెడ్6 ప్రో 5జీ కొనుగోలు చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి


DISCLAIMER: ఈ సమాచారం మొత్తం అమెజాన్ వెబ్ సైట్ నుంచి సేకరించినది. వీటికి సంబంధించిన ఫిర్యాదులకు అమెజాన్ ఇండియాను సంప్రదించండి. ఇక్కడ పేర్కొన్న ఉత్పత్తుల నాణ్యత, ధర, ఆఫర్లను ఏబీపీ దేశం కన్ఫర్మ్ చేయదు.