టెక్నో మనదేశంలో ఇటీవలే పోవా 3 అనే కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సేల్ అమెజాన్‌లో ప్రారంభం అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఏకంగా 55 రోజుల స్టాండ్‌బై టైంను ఈ ఫోన్ అందించనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో లాంచ్ అవ్వడం దీనికి పెద్ద ప్లస్.


టెక్నో పోవా 3 ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,499గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. ఎకో బ్లాక్, టెక్ సిల్వర్, ఎలక్ట్రిక్ బ్లూ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


టెక్నో పోవా 3 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. 6 జీబీ వరకు ర్యామ్ ఉంది. మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరో 7 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. అంటే 13 జీబీ వరకు ర్యామ్ లభించనుందన్న మాట.


ఇక కెమెరాల విషయానికి వస్తే... దీని వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు సెకండరీ, టెర్టియరీ సెన్సార్లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


4జీ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఈ ఫోన్‌లో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్ కాగా... 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.94 సెంటీమీటర్లు కాగా, బరువు 230 గ్రాములుగా ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!