సోనీ 100 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం మిడ్ రేంజ్, బడ్జెట్ ఫోన్లలో ఈ సెన్సార్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్, గూగుల్ కంపెనీలకు సోనీనే సెన్సార్లు అందిస్తుంది. అయితే ఈ 100 మెగాపిక్సెల్ సెన్సార్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు.
ప్రస్తుతం శాంసంగ్ 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను రూపొందించే పనిలో ఉంది. దీనికి ఐసోసెల్ హెచ్‌పీ3 అని పేరు పెట్టనున్నారు. 2023లో లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్ ఫోన్‌లో ఈ సెన్సార్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలుపుతున్న దాని ప్రకారం సోనీ ఐఎంఎక్స్8 సిరీస్‌లో ఈ 100 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉండనుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకు అందుబాటులో ఉన్న పెద్ద సెన్సార్లలో శాంసంగ్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉండనుందని తెలుస్తోంది. శాంసంగ్ ఇప్పటికే 108 మెగాపిక్సెల్ సెన్సార్లను లాంచ్ చేసింది.
సోనీ ఐఎంఎక్స్8 సెన్సార్‌తో పాటు ఐఎంఎక్స్9 సెన్సార్లపై కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. లీకుల ప్రకారం దాదాపు ఒక అంగుళం సైజు ఉన్న 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కూడా సోనీ రూపొందిస్తుందని తెలుస్తోంది. దీనికి ఐఎంఎక్స్989 అని పేరు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సెన్సార్ షియోమీ 12 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌తో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుం స్మార్ట్ ఫోన్ ఫొటోగ్రఫీలో టాప్ లో ఉన్న యాపిల్, గూగుల్ ఫోన్లకు కూడా సోనీనే కెమెరా సెన్సార్లు సప్లై చేస్తుంది కాబట్టి ఈ 100 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ సెన్సార్లపై మంచి అంచనాలు ఉన్నాయి. మోటొరోలా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్ లాంచ్ చేయనుందని అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల అయింది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!