గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు క్షీణించడం దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్‌పై ప్రభావం చూపింది. 2023లో తన స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లను 13 శాతం తగ్గించాలని శాంసంగ్ నిర్ణయించుకున్నట్లు మీడియా నివేదించింది. 13 శాతం తగ్గించడం అంటే దాదాపు మూడు కోట్ల యూనిట్లు తగ్గనున్నాయని అని తైవాన్ ఎకనామిక్ డైలీ నివేదిక తెలిపింది.
కోవిడ్-19 కారణంగా స్మార్ట్‌ఫోన్‌ల డిమాండ్ తగ్గడం, సప్లై చెయిన్ సమస్యల వల్ల శాంసంగ్ కూడా దెబ్బతింది. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికం (Q3)లో షిప్‌మెంట్‌ల పరంగా Samsung తన మార్కెట్ వాటాను పెంచుకోగలిగినప్పటికీ, గత సంవత్సరంతో పోల్చినప్పుడు మొత్తం ఎనిమిది శాతం క్షీణతను చూసింది.
కంపెనీ తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లపై దృష్టి సారించి వచ్చే ఏడాది 270 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో 260 మిలియన్ యూనిట్లను విక్రయిస్తామని శాంసంగ్ అంచనా వేసింది. గత సంవత్సరం కంటే దాదాపు 10 మిలియన్లు ఎక్కువగా ఉంది. వచ్చే ఏడాది దీన్ని మరో 10 మిలియన్లకు పెంచాలని కంపెనీ కోరుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కంపెనీ ఫోల్డబుల్ ఫోన్లపై దృష్టి సారించింది.
శాంసంగ్ రాబోయే ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫిబ్రవరి 2023లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లైనప్ ముఖ్య హైలైట్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా. ఇది 200MP ప్రైమరీ కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు Xiaomi 12T ప్రోలో కనిపించే 200MP కెమెరా కంటే Samsung Galaxy S23 Ultra 200MP కెమెరా మెరుగ్గా ఉండవచ్చని లీక్‌లు వస్తున్నాయి. ప్రఖ్యాత లీక్‌స్టర్ ఐస్ యూనివర్స్ ప్రకారం గెలాక్సీ S23లోని 200MP కెమెరా "ప్రపంచం చూడని అత్యుత్తమమైనది" కావచ్చు.
కొత్త లీక్ ప్రకారం, Galaxy S23 Ultra సెన్సార్ మెరుగైన హై-రిజల్యూషన్ ఇమేజ్‌లను అందించనుంది. ఇది గత కొన్ని సంవత్సరాల్లో Samsung తన ఫ్లాగ్‌షిప్ కెమెరాలకు తీసుకువచ్చిన అతిపెద్ద కెమెరా అప్‌డేట్ అని తెలుస్తోంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?