శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ 5జీ ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యాన్ని కంపెనీ పెంచనుందని వార్తలు వస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, అది గెలాక్సీ ఎస్23 ప్లస్‌కు 4700 ఎంఏహెచ్‌కు పెరగనుందని వార్తలు వస్తున్నాయి. అయితే గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23ల్లో ఎటువంటి మార్పులు జరగనున్నాయో తెలియరాలేదు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ సైజు కూడా గెలాక్సీ ఎస్22 ప్లస్ తరహాలోనే ఉండనుంది. ఈ ఫోన్‌లో స్టాకింగ్ టెక్నాలజీని కంపెనీ అందించనున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ తరహాలోనే గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫీచర్లు కూడా ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి కాబట్టి గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఈ మూడిట్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి.


సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎస్22 పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 3700 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22+ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో శాంసంగ్ అందించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఇందులో శాంసంగ్ అందించింది. గెలాక్సీ ఎస్22 తరహాలోనే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్22+ సపోర్ట్ చేయనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపైనే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల ఎడ్జ్ క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2X డిస్‌ప్లేను అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 512  జీబీ వరకు స్టోరేజ్‌ శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో ఉంది.


ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, మరో 10 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 40 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?