అక్టోబర్ 1న జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 5G సేవలను ప్రారంభించారు. Airtel, Jio, Viతో సహా అన్ని ప్రధాన టెలికాంలు భారతదేశంలో తమ 5G సేవల రోల్ అవుట్ ప్లాన్‌లను రూపొందించాయి. Jio దసరా నుంచి 5 నగరాల్లో ఎంపిక చేసిన కస్టమర్లకు 5G సేవలను అందిస్తోంది. Vi త్వరలో రోల్ అవుట్‌ను ప్రారంభించబోతోంది. Airtel ఇప్పటికే ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, గురుగ్రామ్, కోల్‌కతా, హైదరాబాద్ తో పాటు చెన్నై నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది. అంతేకాదు.. తమ ప్రస్తుత 4G సిమ్‌లు 5G నెట్‌వర్క్‌కు అనుకూలంగా ఉంటాయని Airtel ప్రకటించింది. మిగతా కంపెనీలతో పోల్చితే కస్టమర్లకు ముందుగా 5G సేవలను అందుబాటులోకి తేవడంతో Airtel సక్సెస్ అయ్యింది. చాలా కాలంగా 5G సేవల కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లు ఇప్పుడు వాటిని వినియోగించుకునేందుకు సిద్ధం అయ్యారు.
5G అంటే ఏంటి?
5G నెట్‌వర్క్ కస్టమర్‌లకు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్, మల్టీమీడియా సర్వీసెస్ అందించే లేటెస్ట్ టెక్నాలజీ. 5G నెట్‌వర్క్ ఒక మిల్లీసెకనులో డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. 4G జీ కంటే 50 రెట్లు వేగవంతమైన పనితీరు కనబరుస్తుంది. ఫోన్ల బ్యాటరీ లైఫ్ కూడా గణనీయంగా పెంచుతుంది. 5G డౌన్‌లోడ్ స్పీడ్ భారీగా పెరుగుతుంది. 5G టెక్నాలజీ మూలంగా స్మార్ట్ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబోటిక్ సర్జరీల్లో కీలక ముందగుడు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో 5G టెక్నాలజీ అందుబాటులో ఉంది. తాజాగా భారత్ లో అందుబాటులోకి వచ్చింది.
స్మార్ట్ఫోన్లో 5G నెట్వర్క్ని ఎలా యాక్టివేట్ చేయాలి?
ఆయా సెల్యులార్ కంపెనీలు 5G సేవలను మీ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత.. యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ ను కలిగి ఉంటే.. 5G నెట్ వర్క్ ను యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది. 5G నెట్ వర్క్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూడండి.
⦿ ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో ‘Settings’ ఓపెన్ చేయండి.
⦿ ఆ తర్వాత ‘Mobile network’ను సెలెక్ట్ చేయండి.
⦿ మీరు 5Gని ప్రారంభించాలనుకుంటున్న SIMను ఎంచుకోవాలి.
⦿ ఆ తర్వాత ‘Preferred network type’ను ఎంపికను ఎంచుకోవాలి.
⦿ ఇప్పుడు ‘కేవలం 5G నెట్‌వర్క్’ రకాన్ని ఎంచుకోండి.
⦿ మీ ప్రాంతంలో 5G అందుబాటులోకి వచ్చినట్లయితే, మీరు స్టేటస్ బార్ లో 5G సింబల్ ను పొందే అవకాశం ఉంటుంది.
Airtel 5Gని ఎవరు ఉపయోగించవచ్చు?
వ్యక్తిగత వినియోగదారుల కోసం 5Gని ఉపయోగించడానికి.. ముందుగా మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్టు చేసుందో లేదో తెలుసుకోవాలి. మీ హ్యాండ్‌సెట్ 5Gకి సపోర్టు చేసేది అయి ఉంటే.. Airtel 5G బ్యాండ్‌లకు సపోర్టు ఇస్తుందని నిర్దారించుకోవాలి. ఈ సమాచారాన్ని రిటైల్ బాక్స్, లేదంటే తయారీదారు వెబ్‌సైట్‌లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు 5G అనుకూల స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండి, 5G సేవలు ప్రారంభించిన ప్రదేశంలో నివసిస్తే, యాక్టివ్ 5G రీఛార్జ్ ప్లాన్ ను కలిగి ఉండాలి. అప్పుడు 5G సేవలు పొందే అవకాశం ఉంటుంది.