Samsung Galaxy S21 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ గతేడాది మనదేశంలో లాంచ్ అయింది. 2021లో లాంచ్ అయిన గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మనదేశ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్‌ను కొత్త ప్రాసెసర్‌తో మళ్లీ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ మళ్లీ వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. ఇందులో ఎక్సినోస్ 2100 ప్రాసెసర్‌ను అందించారు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ధర
ఇందులో రెండు స్టోరేజ్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.54,999గా ఉండగా, ఇప్పుడు రూ.31,999కు తగ్గించారు. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.58,999గా ఉంది. ఈ వేరియంట్ ప్రస్తుతం అందుబాటులో లేదు. గ్రాఫైట్, లావెండర్, ఆలివ్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, శాంసంగ్.కాం, లీడింగ్ ఆన్‌లైన్ అవుట్ లెట్స్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ అందుబాటులో ఉండనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 25W సూపర్ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఎక్సినోస్ 2100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్‌ను అందించారు. 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.79 సెంటీమీటర్లుగా ఉంది.


శాంసంగ్ తన వినియోగదారుల కోసం బిగ్ టీవీ డేస్ సేల్‌ను నిర్వహిస్తుంది. ఇందులో టీవీలపై భారీ ఆఫర్‌ను అందిస్తున్నారు. శాంసంగ్ తన నియో క్యూఎల్ఈడీ 8కే, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, ది ఫ్రేమ్, క్రిస్టల్ 4కే క్యూహెచ్‌డీ టీవీలపై ఈ ఆఫర్‌ను అందిస్తుంది. జులై 15వ తేదీ నుంచి జులై 25వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అంతే కాకుండా ఈ సేల్ సందర్బంగా 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. దీంతో పాటు బండిల్డ్ ఆఫర్స్ కూడా అందించనున్నారు. ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం 8కే రిజల్యూషన్ టీవీలను శాంసంగ్, హైసెన్స్ మాత్రమే విక్రయిస్తున్నాయి. సోనీ 8కే టీవీలు మనదేశంలో ప్రస్తుతానికి అందుబాటులో లేవు.






Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!