కొరియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ (SAMSUNG) లాంచ్ చేయనున్న బడ్జెట్ 5జీ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ సోమవారం (ఆగస్టు 7వ తేదీ) మనదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. కంపెనీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్, డిజైన్ సమాచారాన్ని వెల్లడించింది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్న ట్రిపుల్ కెమెరాను కూడా అందించనున్నారు. దీంతో పాటు శక్తివంతమైన 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉండనుంది.


డిస్‌ప్లే ఎలా ఉంటుంది?
భారతదేశంలో గత ఏడు రోజులుగా శాంసంగ్ ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ గురించి టీజ్ చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ స్మార్ట్ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ ఉన్న 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. టీజర్ ప్రకారం ఫోన్ ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, వాటర్‌డ్రాప్ స్టైల్ కటౌట్ కూడా ఇచ్చారు.


కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ రంగులలో అందుబాటులో ఉండనుంది. గాడ్జెట్‌బ్రిడ్జ్ వార్తల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో గేమ్ ఛేంజర్‌గా నిలవనుందని శాంసంగ్ తెలిపింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ల్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా గరిష్టంగా 1 టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.


ధర ఎంతగా ఉండనుంది?
టీజర్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ధర రూ. 16 వేల నుంచి రూ. 17 వేల మధ్య ఉండవచ్చు. ఈ ఫోన్ ఆగస్ట్ 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందులో 11 5జీ బ్యాండ్‌లు, స్మార్ట్ హాట్ స్పాట్‌లు ఉంటాయి. ఈ ఫోన్‌లొ ఎక్సినోస్ 1280 5ఎన్ఎం ప్రాసెసర్‌ని అందించనున్నారు. ఇది మీకు మొబైల్ గేమింగ్‌లో గొప్ప అనుభూతిని ఇస్తుంది.










Read Also: ఐఫోన్ లవర్స్‌ కు బ్యాడ్‌న్యూస్ - 15 ప్రో సిరీస్ ధరలు భారీగా పెంపు - రూ.2 లక్షలు దాటించేస్తారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial