రెడ్‌మీ నోట్ 11 సిరీస్ ఫోన్లు చైనాలో గత నెలలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు కంపెనీ రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫోన్లను రూపొందించనుందని తెలుస్తోంది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 11టీ ప్రో, రెడ్‌మీ నోట్ 11టీ ప్రో ప్లస్, రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ ఫోన్లు ఉన్నాయి.


డిజిటల్ చాట్ స్టేషన్ అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయని ప్రకటించారు. అక్టోబర్‌లో ఈ ఫోన్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్ ఉంది.


ఇందులో పంచ్ హోల్ ఉన్న ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఎక్కువగా ఉండనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది.


రెడ్‌మీ నోట్ 11టీ ప్రో సిరీస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.6 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 270 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10 ప్లస్ వంటి టాప్ క్లాస్ ఫీచర్లను కూడా ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్‌లో అందించారు.


ఈ రెండు ఫోన్లూ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై పనిచేయనున్నాయి. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంలను ఈ ఫోన్లలో అందించారు.


ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!