వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్ ఫోన్ గత నెలలో గ్లోబల్ లాంచ్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుంది. జూన్‌లోనే వన్‌ప్లస్ నార్డ్ 2టీ మనదేశంలో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లోనే అందుబాటులో ఉండనుంది.
వన్‌ప్లస్ నార్డ్ 2టీ ధర
యూరోప్‌లో ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 399 యూరోలుగా (సుమారు రూ.32,600) ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 499 యూరోలుగా (సుమారు రూ.40,800) నిర్ణయించారు. గ్రే షాడో, జేడ్ ఫాగ్ కలర్ఆప్షన్లలో వన్‌ప్లస్ నార్డ్ 2టీని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ ధర రూ.25 వేల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ 2టీ పనిచేయనుంది. 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను కూడా ఇందులో అందించారు. హెచ్‌డీఆర్10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 80W సూపర్ వూక్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 సెన్సార్ కూడా అందించారు. వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఇందులో అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!