రియల్‌మీ క్యూ5ఐ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. రియల్‌మీ క్యూ5 సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇదే సిరీస్‌లో రియల్‌మీ క్యూ5 ప్రో స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ కానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
రియల్‌మీ క్యూ5ఐ ధర
రియల్‌మీ క్యూ5ఐ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,199 యువాన్లుగా (సుమారు రూ.14,300) ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,299 యువాన్లుగా (సుమారు రూ.15,500) నిర్ణయించారు. గ్రాఫైట్ బ్లాక్, ఆబ్సిడియన్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో రియల్‌మీ క్యూ5ఐ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
రియల్‌మీ క్యూ5ఐ ఫీచర్లు
6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని డిస్‌ప్లే డిజైన్ వాటర్ డ్రాప్ నాచ్ తరహాలో ఉంది. సెల్ఫీ కెమెరా నాచ్‌లోనే ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు మరో ఏఐ లెన్స్ అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
దీని మందం కేవలం 8.1 మిల్లీమీటర్లు మాత్రమే ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. హైరెస్ సర్టిఫైడ్ డ్యూయల్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. డైనమిక్ ర్యామ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని ద్వారా ర్యామ్‌ను మరో 5 జీబీ పెంచుకోవచ్చు.