రియల్‌మీ సీ30ఎస్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లేను అందించారు.


రియల్‌మీ సీ30ఎస్ ధర
ఇందులో రెండు స్టోరేజ్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది.


స్ట్రైప్ బ్లాక్, స్ట్రైప్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు దీని సేల్ ప్రారంభం కానుంది. సాధారణ సభ్యులకు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.


రియల్‌మీ సీ30ఎస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ 9863ఏ ప్రాసెసర్‌పై రియల్‌మీ సీ30ఎస్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరా ద్వారా హెచ్‌డీ వీడియోలను 30 ఎఫ్‌పీఎస్ ఫ్రేమ్ రేట్‌లో షూట్ చేయవచ్చు.


ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో ఉంది. 2.4 గిగాహెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ వీ4.2 కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 186 గ్రాములుగా ఉంది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?