ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు మనదేశంలో త్వరలో లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒప్పో రెనో 8 ప్రోలో కెమెరా క్వాలిటీ కోసం ప్రత్యేకంగా మారిసిలికాన్ ఎక్స్ సిలికాన్ చిప్‌ను కంపెనీ అందించనుంది. దీన్ని ఒప్పోనే స్వయంగా రూపొందించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో, ఒప్పో రెనో 8 ప్రో ప్లస్‌లను కంపెనీ చైనాలో లాంచ్ చేసింది.


ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ధర ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ రెండు ఫోన్లూ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. ఒప్పో రెనో 8లో ప్రారంభ వేరియంట్ ధర రూ.30 వేల నుంచి ప్రారంభం కానుంది.


జులై 21వ తేదీన ఈ సిరీస్ మనదేశంలో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఒప్పో కచ్చితమైన తేదీని వెల్లడించలేదు కానీ... త్వరలో లాంచ్ కానున్నాయని ట్వీట్ ద్వారా టీజ్ చేసింది. ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ కానున్నాయని సమాచారం. ఒప్పో రెనో 8 ప్రో ప్లస్ లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు.


అయితే కంపెనీ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లను రివీల్ చేయలేదు. ఒప్పో రెనో 8లో చైనా వేరియంట్ స్పెసిఫికేషన్లే ఉండే అవకాశం ఉంది. అయితే చైనాలో లాంచ్ అయిన ఒప్పో రెనో 8 ప్రో ప్లస్‌ను రీబ్రాండ్ చేసి ఒప్పో రెనో 8 ప్రోగా మనదేశంలోకి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి ఒప్పో రెనో 8 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ లేదా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది.


దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను జులై 5వ తేదీన, జులై 11వ తేదీన ఒప్పో రివీల్ చేయనున్నట్లు తెలిపింది. ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్లు కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్లుగా లాంచ్ కానున్నాయి. వీటిలో కెమెరాపైనే ఒప్పో ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. ఈ ఫోన్లు మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానున్నాయో కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. దీంతోపాటు ఒప్పో ప్యాడ్ ఎయిర్ కూడా మనదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!