మోటొరోలా త్వరలో చైనాలో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అదే మోటొరోలా ఎక్స్30 ప్రో. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలకు మూడు వేర్వేరు ఫోకల్ లెంత్‌లు ఉండనున్నాయి. హెచ్‌డీ పొర్‌ట్రెయిట్ మోడ్ కూడా ఇందులో అందించనున్నారు. అయితే మోటొరోలా ఇంతకంటే ఎక్కువ వివరాలను వెల్లడించలేదు.


త్వరలో ఒక లాంచ్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కూడా గ్లోబల్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల ఫోకల్ లెంత్ 35 మిల్లీమీటర్లు, 50 మిల్లీమీటర్లు, 85 మిల్లీమీటర్లుగా ఉండనుంది. 85 మిల్లీమీటర్ల లెన్స్ ద్వారా గొప్ప క్లోజప్ పొర్‌ట్రెయిట్ షాట్లు తీయవచ్చని తెలుస్తోంది. ఇక 50 మిల్లీమీటర్ల లెన్స్ స్టాండర్డ్ వ్యూయింగ్ యాంగిల్‌గానూ, 35 మిల్లీమీటర్ల లెన్స్ మూడు సెన్సార్లలో క్లోజెస్ట్ వ్యూయింగ్ యాంగిల్‌ను అందించనుంది.


ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ గతంలోనే టీజ్ చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. 200 మెగాపిక్సెల్ కెమెరా ఇందులో ఉండనుంది. చైనాలో మోటొరోలా ఎక్స్30 ప్రో, ఇతర మార్కెట్లలో మోటొరోలా ఎడ్జ్30 అల్ట్రా పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


మోటొరోలా ఎక్స్30 ప్రో ఇటీవలే చైనా కంపల్సరీ సర్టిఫికేషన్ (3సీ) వెబ్ సైట్‌లో కూడా కనిపించింది. ఈ ఫోన్ 125W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నట్లు సమాచారం. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండనున్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!