Asus ROG Phone 6: అసుస్ కొత్త గేమింగ్ ఫోన్ వచ్చేస్తుంది - 18 జీబీ వరకు ర్యామ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ మనదేశంలో కొత్త గేమింగ్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే అసుస్ రోగ్ ఫోన్ 6.

Continues below advertisement

అసుస్ రోగ్ ఫోన్ 6 స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులై 5వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ గేమింగ్ ఫోన్ మనదేశంలో వర్చువల్ ఈవెంట్ ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ సేల్‌కు రానుంది. దీంతోపాటు ఈ ఫోన్ రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

Continues below advertisement

జులై 5వ తేదీన సాయంత్రం 5:20 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది.ఈ ఈవెంట్‌ను కంపెనీ యూట్యూబ్ చానెల్లో లైవ్ చూడవచ్చు. దీని ధర వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.

ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ దీని రెండర్లను లీక్ చేశారు. దీని ప్రకారం ఈ ఫోన్ బ్లాక్, వైట్ రంగుల్లో లాంచ్ కానుంది. రోగ్ సిరీస్ స్మార్ట్ ఫోన్లన్నీ ఈ కలర్ ఆప్షన్‌లోనే లాంచ్ అవుతాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటితో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించనున్నారు. అసుస్ లోగో, టెన్‌సెంట్ బ్రాండింగ్ కూడా ఫోన్ వెనకవైపు చూడవచ్చు. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్లను ఫోన్ ఎడమవైపు చూడవచ్చు.

ఈ ఫోన్‌తో పాటు రోగ్ ఫోన్ 6 ప్రో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. అసుస్ రోగ్ ఫోన్ 6లో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 18 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఫోన్ వెనకవైపు 64 మెగాపిక్సెల్, ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాలు అందించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Continues below advertisement