OnePlus Nord 3: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ OnePlus తన కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Nord 3ని వచ్చే నెలలో లాంచ్ చేయనుంది. ఇది ఒక మీడియం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కావచ్చు. కంపెనీ దీని అధికారిక లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. కానీ తన కమ్యూనిటీ పోస్ట్ ద్వారా కంపెనీ తన తాజా Nord ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌ని ప్రకటించారు.


OnePlus కమ్యూనిటీ ఫోరమ్‌లోని ఒక టీజర్ పోస్ట్ భారతదేశం, యూరప్, ఆసియా పసిఫిక్ (APAC) దేశాల్లో OnePlus Nord 3ని లాంచ్ చేయనున్నట్లు సూచిస్తుంది. అయితే కంపెనీ స్మార్ట్‌ఫోన్ పేరును వెల్లడించలేదు. 91mobiles.com వార్తల ప్రకారం కంపెనీ దీనిని ది నెక్స్ట్ నార్డ్ అని పిలిచింది. దీన్ని బట్టి జూలైలో భారతదేశంలో వన్‌ప్లస్ నార్డ్ 3 లాంచ్ అవుతుందని భావించవచ్చు.


వన్‌ప్లస్ నార్డ్ 3 ఫీచర్లు (అంచనా)
డిస్‌ప్లే: 6.74 అంగుళాల 1.5K అమోఎల్ఈడీ డిస్‌ప్లే (120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌)
వెనుక కెమెరా: 50MP ప్రధాన కెమెరా + 8MP సెకండరీ సెన్సార్ + 2MP తృతీయ సెన్సార్
సెల్ఫీ కెమెరా: సెల్ఫీలు తీసుకోవడానికి ముందువైపు 16MP కెమెరా
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 9000
స్టోరేజ్: 8 జీబీ/12 జీబీ/16 జీబీ ర్యామ్, 128 జీబీ/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
బ్యాటరీ: 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 13 టాప్ లెవల్‌లో ఆక్సిజన్‌ఓఎస్ 13తో అందుబాటులో ఉంటుంది.


ధర ఎంత ఉండవచ్చు?
వార్తల ప్రకారం OnePlus Nord 3 ధర యూరోప్‌లో 449 యూరోలు (రూ. 39,900), 549 యూరోల (రూ. 48,000) రేంజ్‌లో ఉండవచ్చు. భారతదేశంలో ప్రారంభ మోడల్ ధర రూ. 35,000 లోపే ఉండే అవకాశం ఉంది.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్‌లో మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. పాస్టల్ లైమ్, క్రోమాటిక్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 


ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. రెండు మేజర్ ఆక్సిజన్ ఓఎస్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ తెలిపింది. ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 91.4 శాతంగా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ద్వారా స్క్రీన్‌ను ప్రొటెక్ట్ చేయనున్నారు.


క్వాల్‌కాం స్నాప్‌‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీలో ఉంది. వర్చువల్‌గా మరో 8 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. దీని స్టోరేజ్ 256 జీబీ వరకు ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.






Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?