వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. అదే వన్‌ప్లస్ ఏస్. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది. చైనాలో ఏప్రిల్ 21వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీంతో పాటు కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్‌ను కూడా రివీల్ చేసింది.


వన్‌ప్లస్ ఏస్ డిజైన్
వన్‌ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్‌ను పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఈ పోస్టర్‌లో ఈ ఫోన్ డిజైన్ చూడవచ్చు. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుంది.బ్లూ పింక్ గ్రేడియంట్, బ్లాక్ కలర్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. ముందువైపు పంచ్ హోల్ తరహా డిజైన్ ఉండనుంది. ఈ పంచ్ హోల్‌లోనే సెల్ఫీ కెమెరా ఉండనుంది. ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉండబోదని కంపెనీ తెలిపింది.


వన్‌ప్లస్ ఏస్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ ఉండనుందని తెలుస్తోంది. 12 జీబీ వరకు ర్యామ్‌ను కంపెనీ ఇందులో అందించనుందని తెలుస్తోంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నట్లు సమాచారం. ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. వన్‌ప్లస్ ఏస్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే గీక్‌బెంచ్‌లో కూడా కనిపించింది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించనున్నట్లు గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?