ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ రాబోయే వారాల్లో ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 11ని విడుదల చేయడానికి పని చేస్తుంది. ప్రఖ్యాత టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తాజా లీక్ ప్రకారం Oppo Find N2, OnePlus 11 స్మార్ట్ ఫోన్లు ఒకే తరహా కెమెరా సిస్టంతో రానున్నాయి. 50MP సోనీ IMX890 కెమెరాతో పాటు 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 32MP 2x జూమ్ సెన్సార్‌లను ఈ రెండు ఫోన్లలో అందించనున్నారు.
OnePlus 11, Oppo Find N2 రెండూ Hasselblad కెమెరా ఆప్టిమైజేషన్‌లతో వస్తాయి. ఒప్పో ఫైండ్ ఎన్2 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ని సపోర్ట్ చేస్తుందని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపారు. అయితే వన్‌ప్లస్ 11 OISతో వస్తుందో లేదో స్పష్టంగా తెలియడం లేదు.
వన్‌ప్లస్ 11 ఈ నెలాఖరు లేదా డిసెంబర్ ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Oppo Find N Flip క్లామ్‌షెల్ స్మార్ట్‌ఫోన్, Oppo Find N2తో పాటు డిసెంబర్‌లో మార్కెట్లోకి వస్తుందని అంచనా.
OnePlus 11 స్పెక్స్, ఫీచర్లు (అంచనా)
వన్‌ప్లస్ 11లో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. సెల్ఫీల కోసం ముందువైపు పంచ్ హోల్ కెమెరా ఉండనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నట్లు సమాచారం. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 32 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది.
వన్‌ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.46,999గా నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గానూ, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999గానూ నిర్ణయించారు. జేడ్ గ్రీన్, మూన్ స్టోన్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ 10టీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. లో టెంపరేచర్ పాలీక్రిస్టలైన్ ఆక్సైడ్ (ఎల్టీపీవో) టెక్నాలజీపై ఈ డిస్‌ప్లేను రూపొందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, 10 బిట్ కలర్ డెప్త్, హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు. 4జీ ఎల్టీఈ, 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉంది. 150W సూపర్‌వూక్ ఎండ్యూరన్స్ ఎడిషన్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 160W సూపర్‌వూక్ పవర్ అడాప్టర్‌ను బాక్స్‌లో అందించారు. ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం 19 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 203 గ్రాములుగా ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?