టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ వినియోగదారులకు iOS 16.2 బీటాను విడుదల చేసింది. దీంతో వారి హ్యాండ్‌సెట్‌ల్లో 5జీని ఎంజాయ్ చేయవచ్చు. ఇటీవలే లాంచ్ అయిన iPhone 14, iPhone 13, iPhone 12 కోసం 5జీ ఎంపికను ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ప్రధాన నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చాయి.
యాపిల్ ఈ వారం ప్రారంభంలో ఐవోఎస్ 16 5జీ బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను విడుదల చేసింది. iPhone 14, iPhone 13, iPhone 12, iPhone SE (మూడవ తరం) మోడల్ స్మార్ట్ ఫోన్లు వాడే వినియోగదారులు యాపిల్ ఐవోఎస్ 16 బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో భాగంగా డిసెంబర్‌లో పబ్లిక్‌గా అందుబాటులోకి వచ్చే ముందే 5జీని ఎంజాయ్ చేయవచ్చు.
Samsung, Xiaomi, Oppo, Vivo వంటి కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇప్పటికే 5జీ ఎయిర్‌వేవ్‌లకు సపోర్ట్‌ను ప్రకటించాయి. ఇప్పుడు దేశంలోని iPhone వినియోగదారులు (బీటా) కూడా తమ హ్యాండ్‌సెట్‌లలో 5జీని ఉపయోగించవచ్చు.
ఐఫోన్ వినియోగదారులు తమ హ్యాండ్‌సెట్‌లలో 5Gని ఎలా యాక్టివేట్ చేయవచ్చో ఇక్కడ ఉంది
మీరు బీటాలో భాగమా, కాదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ కాకపోతే మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి పబ్లిక్ బీటా ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకోవాలి.
నమోదు చేసుకున్న తర్వాత సెట్టింగ్స్> జనరల్> సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కి వెళ్లి, అప్‌డేట్ కోసం చెక్ చేయడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేయండి.
డౌన్‌లోడ్‌పై క్లిక్ చేసి, సాఫ్ట్‌వేర్ నవీకరణను ఇన్‌స్టాల్ చేయండి. (గమనిక: iOSలో ఏదైనా బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు దయచేసి ఫైల్‌లు మరియు మొత్తం డేటాను బ్యాకప్ చేయండి).
5జీని అందించే iOS తాజా వెర్షన్ అయిన iOS 16.2 బీటాకు మీ హ్యాండ్‌సెట్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, మీ ప్రాంతంలో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయండి.
మీ ప్రాంతంలో 5జీ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయడానికి, సెట్టింగ్స్> మొబైల్ డేటా> మొబైల్ డేటా ఆప్షన్> వాయిస్, డేటాకు వెళ్లి 5జీ నెట్‌వర్క్ (అందుబాటులో ఉంటే) ఎంచుకోండి.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?