2022 మూడో త్రైమాసికంలో భారతదేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 30 శాతానికి (గత సంవత్సరంతో పోలిస్తే) పెరిగాయి. అయితే మొత్తంగా చూస్తే స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 12 శాతం తగ్గాయి. క్వార్టర్-ఆన్-క్వార్టర్ ప్రాతిపదికన స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లలో 16 శాతం వృద్ధి నమోదు అయిందని ఒక నివేదిక వెల్లడించింది. సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) ప్రకారం మొత్తం మొబైల్ మార్కెట్ 2022 మూడో త్రైమాసికంలో 16 శాతం క్షీణించింది.
"ఇటీవలి 5G వేలం నేపథ్యంలో ఈ త్రైమాసికంలో 5G స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్‌లు ఊపందుకున్నాయి. పండుగ సీజన్ అమ్మకాల కారణంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు కూడా మంచి వృద్ధిని సాధించాయి" అని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్, సైబర్ మీడియా రీసెర్చ్ విశ్లేషకుడు మెంక కుమారి చెప్పారు.
శాంసంగ్ మొత్తం ఇండియా మొబైల్ మార్కెట్‌లో 19 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, షావొమీ 22 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ముందుంది. 2022 క్యూ3లో వాల్యూ ఫర్ మనీ స్మార్ట్‌ఫోన్ విభాగంలో (రూ. 7,000 - రూ.25,000) వినియోగదారుల డిమాండ్ ఎక్కువగా ఉంది. 79 శాతం స్మార్ట్‌ఫోన్‌లు ఈ ధరల విభాగంలో షిప్పింగ్ అయ్యాయి.
అయితే ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ (రూ.25,000 - రూ.50,000) తొమ్మిది శాతం, సూపర్-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ (రూ. 50,000-రూ. 1,00,000) షిప్‌మెంట్‌లు 39 శాతం పెరిగాయి. 2జీ, 4జీ ఫీచర్ ఫోన్ విభాగాలు 21 శాతం, 58 శాతం (గత సంవత్సరంతో పోలిస్తే) తగ్గాయి.
యాపిల్ iOS 16 5జీ బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ భారతదేశంలో లైవ్ అయింది. Airtel, Jio కస్టమర్‌లు ఇప్పుడు సూపర్ ఫాస్ట్ నెక్స్ట్ జెన్ నెట్‌వర్క్ సేవలను ఎంజాయ్ చేయవచ్చు. iPhone 14, iPhone 13, iPhone 12, iPhone SE (మూడవ తరం) మోడల్ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వినియోగదారులు ముందే 5జీని పొందవచ్చు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?