వన్‌ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్ త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది. ఆగస్టు 3వ తేదీ నుంచి దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ అమెజాన్‌లో లిస్ట్ అయింది కూడా. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుందని తెలుస్తోంది. దీని ధర ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.


వన్‌ప్లస్ 10టీ ధర (అంచనా)
ఐటీహోం వెబ్‌సైట్ కథనం ప్రకారం... వన్‌ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్ ధర 3,000 యువాన్ల (మనదేశ కరెన్సీలో రూ.35,000) నుంచి 4,000 యువాన్ల (మనదేశ కరెన్సీలో రూ.47,000) మధ్య ఉండనుంది. దీని ధర మనదేశంలో రూ.49,999గా ఉండనుందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో ఏది నిజమో తెలియాలంటే లాంచ్ అయ్యేదాకా ఆగక తప్పదు.


వన్‌ప్లస్ 10టీ స్పెసిఫికేషన్లు (అంచనా)
వన్‌ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీవో 2.0 అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. ఈ మొబైల్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉండనుంది. హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా వన్‌ప్లస్ 10టీలో అందించారు. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉండనుంది.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 150W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. అరగంటలోపే బ్యాటరీ ఫుల్‌గా చార్జ్ కానుంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ ఫోన్‌లో అందించనున్నారు. డ్యూయల్ స్పీకర్ సెటప్ ఇందులో ఉండనుంది. బ్లూటూత్ వీ5.3 కనెక్టివిటీతో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!