ఐకూ 9టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఆగస్టు 2వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ మనదేశంలో ఆగస్టు 2వ తేదీన లాంచ్ కానుంది. దీన్ని ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ మనదేశంలో ఆగస్టు 2వ తేదీన లాంచ్ కానుంది.


కంపెనీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. రూ.55 వేల లోపు ధరలో ఉన్న ఫోన్లలో ఐకూ మాత్రమే అత్యధిక బెంచ్ మార్కింగ్ స్కోరు సాధించిందని తెలిపింది. తాజా లీకుల ప్రకారం ఈ ఫోన్ నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 


8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో లాంచ్ కానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఈ వివరాల ప్రకారం... ఇందులో 6.78 అంగుళాల 2కే రిజల్యూషన్ ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఎల్టీపీవో ప్యానెల్‌ కూడా ఈ ఫోన్‌లో ఉండనుంది.


ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జీఎన్1 సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్లు వెనకవైపు ఉండనున్నాయి. ఇన్ డిస్‌ప్లే అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్‌తో పాటు అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


వివో వీ1+ ఇమేజింగ్ చిప్ ఈ ఫోన్‌లో కంపెనీ అందించనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 200W వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ లేదా ఆరిజిన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!