Tecno Camon 19 Neo Sale: టెక్నో కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.12 వేలలోపే 6 జీబీ ర్యామ్!

టెక్నో కామోన్ 19 నియో స్మార్ట్ ఫోన్ సేల్ అమెజాన్‌లో మొదలయింది.

Continues below advertisement

టెక్నో కామోన్ 19 నియో స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి.

Continues below advertisement

టెక్నో కామోన్ 19 నియో ధర
ఇందులో  ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.12,499గా నిర్ణయించారు. ఎకో బ్లాక్, జియోమెట్రిక్ గ్రీన్, సీ సాల్ట్ వైట్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.750 తగ్గింపు లభించనుంది.

టెక్నో కామోన్ 19 నియో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.8 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్‌ను అందించారు. పంచ్ హోల్ డిజైన్, ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై టెక్నో కామోన్ 19 నియో పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండటం విశేషం. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... దీని వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మాక్రో సెన్సార్, ఏఐ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ఉంది.

ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా టెక్నో కామోన్ 19 నియో సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, 4జీ ఎల్టీఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో చూడవచ్చు.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Continues below advertisement