వన్‌ప్లస్ 10ఆర్ 5జీ ప్రైమ్ బ్లూ ఎడిషన్ మనదేశంలో లాంచ్ అయింది. వన్‌ప్లస్ 10ఆర్ 5జీ ఇప్పటికే మనదేశంలో లాంచ్ అయింది. ఇప్పుడు ఇందులో ప్రైమ్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ ప్రైమ్ ఎడిషన్‌లో వన్‌ప్లస్ 10ఆర్ 5జీ తరహా ఫీచర్లే ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.


వన్‌ప్లస్ 10ఆర్ 5జీ ప్రైమ్ బ్లూ ఎడిషన్ ధర
దీని ధర మనదేశంలో రూ.38,999గా ఉంది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో రూ.32,999 ధరతోనే ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.1,500 తగ్గింపు లభించనుంది. అయితే ఈ ఆఫర్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వరకు మాత్రమే ఉంటుందా? తర్వాత కూడా ఈ ధరకే విక్రయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.


వన్‌ప్లస్ 10ఆర్ 5జీ ప్రైమ్ బ్లూ ఎడిషన్ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా... స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం 2.5డీ కర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా వన్‌ప్లస్ 10ఆర్‌లో అందించారు.


4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ ఉన్న ఆప్షన్,  5000 ఎంఏహెచ్, 150W ఫాస్ట్ చార్జింగ్ ఉన్న ఆప్షన్లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 10ఆర్ పనిచేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ ఎస్5కే3పీ9 సెన్సార్‌ను అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా వన్‌ప్లస్ 10ఆర్‌లో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.82 సెంటీమీటర్లు కాగా... బరువు 186 గ్రాములుగా ఉంది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?