గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లు అక్టోబర్ 6వ తేదీన లాంచ్ కానున్నాయి. ఇప్పుడు లాంచ్‌కు ముంగిట దీని ధర ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీని ధరలు గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌కు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి దీని ధరలో ఎక్కువగా మార్పు ఉండకపోవచ్చు.


దీనికి సంబంధించిన ఫొటోలను ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఇందులో కేవలం ధర మాత్రమే కాకుండా కలర్ ఆప్షన్లు కూడా రివీల్ చేశారు. ఈ లీక్ ప్రకారం స్నో, ఆబ్సిడియన్, లెమన్ గ్రాస్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. గూగుల్ పిక్సెల్ 7 ప్రోకు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.


గూగుల్ పిక్సెల్ 7 ప్రో ధర... గూగుల్ పిక్సెల్ 7 ధర కంటే 300 డాలర్లు ఎక్కువగా ఉండనుంది. దీని ధర 899 డాలర్లుగా (మన దేశ కరెన్సీలో సుమారు రూ.72,700) ఉండనుంది. ఆబ్సిడియన్, హాజెల్, స్నో కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లు ఈసారి మనదేశంలో కూడా లాంచ్ కానున్నాయి. అయితే దీని ధర మాత్రం ఎక్కువగా ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ అసలు ధర మనదేశంలో రూ.43,999 కాగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.30 వేలలోపు ధరకే ఇది అందుబాటులో ఉంది.


గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రోలను మొదటిగా గూగుల్ ఐవో సదస్సులో రివీల్ చేశారు. కంపెనీ రెండో తరం టెన్సార్ ప్రాసెసర్లను వీటిలో అందించనున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఫొటోలు, వీడియోలు, సెక్యూరిటీ, స్పీచ్ రికగ్నిషన్‌లకు ప్రత్యేకమైన ఫీచర్లను ఈ చిప్‌సెట్ అందించనుందని గూగుల్ తెలిపింది. కొన్ని రోజుల క్రితం పిక్సెల్ 7 ప్రో అన్‌బాక్సింగ్ వీడియో ఆన్‌లైన్‌లో లీకైంది. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో దీన్ని చూడవచ్చు.


అక్టోబర్ 6వ తేదీన రాత్రి 7:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) గూగుల్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో, గూగుల్ పిక్సెల్ వాచ్‌లు ఈ కార్యక్రమంలో లాంచ్ కానున్నాయి. గూగుల్ ల్యాండింగ్ పేజీలో దీని వివరాలను చూడవచ్చు. దీంతోపాటు నెస్ట్ స్మార్ట్ హోం ప్రొడక్ట్స్ కూడా కంపెనీ లాంచ్ చేసింది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?