నుబియా జెడ్40ఎస్ ప్రో చైనాలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. గతంలో లాంచ్ అయిన నుబియా జెడ్40 ప్రోకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇది ఒక కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్. ఫొటోలు, వీడియోల కోసం ఇందులో అలెర్ట్ స్లైడర్ కూడా ఉంది.

నుబియా జెడ్40ఎస్ ప్రో ధరఈ ఫోన్ ధర 3,399 యువాన్ల నుంచి (సుమారు రూ.40,000) ప్రారంభం కానుంది. మ్యాజిక్ గ్రీన్, నైట్ సీ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో నుబియా జెడ్40ఎస్ ప్రో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

నుబియా జెడ్40ఎస్ ప్రో స్పెసిఫికేషన్లుఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 480 హెర్ట్జ్‌గానూ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 18 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్787 ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు ఉన్న 16 మెగాపిక్సెల్ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 120W ఫాస్ట్ చార్జింగ్ ఉన్న వేరియంట్లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైఓఎస్ 12 స్కిన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!