వివో టీ1ఎక్స్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి.


వివో టీ1ఎక్స్ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో జులై 27వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.


వివో టీ1ఎక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అందించారు. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 90.6 శాతం కాగా, ఎన్టీఎస్సీ కలర్ గాముట్ 96 శాతంగా ఉంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. ఫేస్ అన్‌లాక్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!