నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్‌లో 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జులై 12వ తేదీన ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ ఆన్‌లైన్‌లో లీకైంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీంతోపాటు మరిన్ని డివైస్‌లను కూడా రూపొందించనున్నట్లు వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ తెలిపారు.


91మొబైల్స్ కథనం ప్రకారం... నథింగ్ బ్రాండెడ్ చార్జర్ సింగపూర్ సర్టిఫికేషన్ వెబ్ సైట్లో కనిపించింది. సీ304, సీ347, సీ348 మోడల్ నంబర్లతో ఈ చార్జర్ కనిపించింది. దీన్ని బట్టి నథింగ్ మొత్తం ఫాస్ట్ చార్జర్లను రూపొందిస్తుందని అర్థం చేసుకోవచ్చు.


నథింగ్ ఫోన్ 1 గురించి ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ గురువారం రివీల్ చేశారు. నథింగ్ ఇయర్ 1కు తర్వాతి వెర్షన్‌గా నథింగ్ ఇయర్ 2ని కంపెనీ లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఇయర్ 2తో పాటు మరో ఉత్పత్తిని కూడా కంపెనీ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.


నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉండనుంది. నథింగ్ ఇయర్ 1 తరహాలో పారదర్శకమైన డిజైన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ఏది నిజమో? ఏది పుకారో? తెలియాలంటే జులై 12వ తేదీ వరకు ఆగాల్సిందే. ఒకవేళ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో వస్తే... ఈ తరహాలో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ ఇదే కానుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!