HMD Touch 4G: భారతీయ మొబైల్ మార్కెట్లో ఒక కొత్త ఒరవడి మొదలైంది. టెక్నాలజీ దిగ్గజం HMD గ్లోబల్, నోకియా అక్టోబర్ 7, 2025 న దేశంలో మొట్టమొదటి "హైబ్రిడ్ ఫోన్" విడుదల చేసింది. అది HMD నోకియా టచ్ 4G. ఈ సరికొత్త ఆవిష్కరణ ఫీచర్ ఫోన్‌లు, బేసిక్‌ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెరిపేయనుంది. కేవలం ₹3,999తోనే టచ్‌స్క్రీన్ సౌలభ్యాన్ని, 4G కనెక్టివిటీని, కీలకమైన స్మార్ట్ ఫీచర్లు అందిస్తోంది. ఇది నోకియా పాత 'ఆశా' సిరీస్‌ను గుర్తు చేస్తోంది. నాస్టాల్జిక్ డిజైన్‌లో తీసుకొచ్చారు. సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌తోపాటు డిజిటల్ పరిజ్ఞానం కోరుకునే వారిని ఇది మంచి ఫోన్‌.  

Continues below advertisement

'హైబ్రిడ్' అంటే ఏమిటి? కొత్త ఓఎస్‌తో సౌలభ్యం

HMD నోకియా టచ్ 4G ఫోన్‌ పూర్తిగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే స్మార్ట్‌ఫోన్ కాదు. ఇది S30+ టచ్ OS అనే స్మార్ట్ ఫీచర్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. కేవలం సోషల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ చెల్లింపుల కోసం అవసరమైన యాప్‌లు మాత్రమే ప్రీ-లోడ్ చేసి అందిస్తుంది. బేసిక్ కీప్యాడ్ ఫోన్‌ల నుంచి టచ్‌స్క్రీన్ ఫోన్‌లకు వచ్చే వినియోగదారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 

ఫీచర్ ఫోన్ యూజర్లకు స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందించేందుకు 3.2-అంగుళాల QVGA టచ్‌స్క్రీన్‌ అమర్చారు. 4G LTE కనెక్టివిటీతో పాటు, Wi-Fi, బ్లూటూత్ 5.0 కూడా ఉన్నాయి. మొబైల్ నెట్‌వర్క్‌పై మాత్రమే కాకుండా, వైఫై ద్వారా కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. ఇది కేవలం ఫోన్ కాల్స్, మెసేజింగ్‌కే కాకుండా, వీడియో కాలింగ్ సౌక్యం కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది కమ్యూనికేషన్ పద్ధతిని మార్చేస్తుందని భావిస్తున్నారు. GPS, USB-C పోర్ట్ సౌలభ్యం ఈ హైబ్రిడ్ ఫోన్‌లో ఉంది.  

Continues below advertisement

ధర, మార్కెట్ లక్ష్యాలు

₹3,999లకే వస్తున్న HMD నోకియా టచ్ ఫోన్‌ 4G కనెక్టివిటీ, టచ్‌స్క్రీన్, ఆధునిక ఫీచర్లతో మార్కెట్‌లో తీవ్ర పోటీ సృష్టించగలదు. వినియోగదారులు ఈ ఫోన్‌ను HMD ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ సియాన్ ,డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

భారత్‌లో మిలియన్ల మందికి 4G టెక్నాలజీ, డిజిటల్ చెల్లింపుల సౌకర్యాలు తక్కువ ఖర్చుకే అందించడం దీని లక్ష్యం.అందుకే కేవలం ధరపై దృష్టి పెట్టడమే కాకుండా, వినియోగదారులకు సౌలభ్యం కల్పించేలా డ్యూయల్ సిమ్,అత్యవసర కాల్స్ కోసం ప్రత్యేకమైన క్విక్-కాల్ బటన్ వంటి ఫీచర్లు చేర్చారు. ఈ పరికరం HMD "బెటర్ ఫోన్ ప్రాజెక్ట్"లో భాగం. HMD టచ్ 4Gలో 2,000mAh బ్యాటరీని అమర్చారు. ఇది తీసి పెట్టుకోవచ్చు. నేటి స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీని మార్చుకునే సౌలభ్యం లేదు.  

ముఖ్యమైన స్పెసిఫికేషన్స్:

ఫీచర్ వివరాలు
డిస్‌ప్లే 3.2-అంగుళాల QVGA టచ్‌స్క్రీన్
ప్రాసెసర్ యూనిసోక్ T127 చిప్‌సెట్
ఓఎస్ S30+ టచ్ OS
కనెక్టివిటీ 4G LTE, Wi-Fi, BT 5.0, GPS, USB-C
కెమెరాలు 2MP వెనుక (ఫ్లాష్‌తో), 0.3MP ముందు
బ్యాటరీ 2,000mAh (తొలగించదగినది)
మెమొరీ /ర్యామ్ 64MB RAM + 128MB స్టోరేజ్ (మైక్రో SD ద్వారా విస్తరించవచ్చు)
నిర్మాణం IP52 డస్ట్/వాటర్ రెసిస్టెంట్, మెటల్ యునిబాడీ
ఇతర ఫీచర్లు డ్యూయల్ సిమ్, UPI, వీడియో కాలింగ్, స్నేక్ గేమ్

ఈ స్పెసిఫికేషన్స్‌ ప్రకారం చూస్తే, ఇది కచ్చితంగా హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ కాదు. స్టోరేజ్ (64MB RAM + 128MB స్టోరేజ్) పరిమితంగా ఉన్నప్పటికీ, మైక్రో SD ద్వారా విస్తరించుకునే సౌలభ్యం ఉంది. Unisoc T127 చిప్‌సెట్ ఎంపిక అనేది ధర, పనితీరు మధ్య సమతుల్యతను సాధించడానికి జరిగిన ప్రయత్నం.

కెమెరా విభాగంలో కూడా ఇది కేవలం అవసరాలకు మాత్రమే పరిమితమైంది. వెనుక భాగంలో ఫ్లాష్‌తో కూడిన 2MP కెమెరా, ముందు భాగంలో 0.3MP కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు ప్రాథమిక ఫోటోలు వీడియో కాలింగ్ అవసరాలను తీర్చడానికి సరిపోతాయి.

నోకియా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, మెటల్ యునిబాడీతో కూడిన దాని దృఢమైన నిర్మాణం దీనికి అదనపు బలాన్ని చేకూర్చాయి. అంతేకాకుండా, HMD ఒక ఏడాది రీప్లేస్‌మెంట్ గ్యారంటీ అందిస్తోంది. ఇది కొనుగోలుదారులకు మరింత భద్రతా భావాన్ని కలిగిస్తుంది.

భారతదేశంలో ఇంకా అనేక మిలియన్ల మంది ఫీచర్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. 5G శకం వైపు దేశం దూసుకుపోతున్నప్పటికీ, 4Gని ప్రాథమిక డిజిటల్ గేట్‌వేగా ఉపయోగించే యూజర్లు లక్షలాదిగా ఉన్నారు. ఈ పరిస్థితిలో HMD నోకియా టచ్ 4G సరైన సమయంలో సరైన స్థానంలోకి ప్రవేశించింది. ఇది కేవలం ఫోన్ కాదు, ఇది గ్రామీణ మార్కెట్లలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని వేగవంతం చేసే ఒక సాధనంగా మేకర్స్ భావిస్తున్నారు.