ChatGPT Spotify Integration: సంగీత ప్రియుల అనుభవాన్ని పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది స్పాటిఫై. కృత్రిమ మేధస్సు చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీతో కలిసి మరిన్ని అద్భుతాలు చేసేందుకు సిద్ధమైంది. ఈ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. ఈ విప్లవాత్మక కలయికతో వినియోగదారుల మనసులోని భావాలను, మూడ్‌లను లేదా ప్రయాణాల నేపథ్యాన్ని కేవలం పదాల రూపంలో చెబితే చాలు, చాట్‌జీపీటీ దానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన, పర్సనలైజ్డ్ పాటలు, కళాకారులు, ఆల్బమ్‌లు, ప్లేలిస్ట్‌లు లేదా పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లు స్పాటిఫై నుంచి సిఫార్సు చేస్తుంది.
మీరు కారులో ఉన్నా, టీవీ చూస్తున్నా, లేదా గేమింగ్ చేస్తున్నా 2,000 కంటే ఎక్కువ పరికరాల్లో స్పాటిఫై సేవలు అందుబాటులో ఉంది. ఈ యూప్ వాడే వినియోగదారులు ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిరుచి. అందుకే వారి అభిరుచికి తగ్గట్టుగా పాటలు ప్లే చేయాలనే ఉద్ధేశంలో ఈ ముందడుగు వేసింది. మీరు ఉన్న సిచ్యుయేషన్‌ను వివరిస్తే దానికి తగ్గట్టుగా పాటలు, లేదా పాడ్‌కాస్ట్‌లు, ప్లేలిస్ట్‌లు మీకు వినిపిస్తుంది. ఒక్క ట్యాప్ దూరంలో ఈ సేవలను అందుబాటులో ఉంచింది.
వినియోగం ఎలా? నిమిషాల్లో ప్లేలిస్ట్ సృష్టి!
ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం, ఇది స్పాటిఫై ఫ్రీ, ప్రీమియం వినియోగదారులిద్దరికీ అందుబాటులో ఉంచింది.
1. సంభాషణ ప్రారంభం: ముందుగా, మీరు చాట్‌జీపీటీలో మాట్లాడాలి. మీ చెప్పే ప్రాంప్ట్‌లో కచ్చితంగా 'స్పాటిఫై' అని ప్రస్తావించాలి. అప్పుడే మీకు రెండు అనుసంధానమై మీకు కావాల్సిన పాటలు, పాడ్‌కాస్ట్‌లు అందిస్తుంది.
2. అకౌంట్ లింకింగ్: మీరు మొదటిసారి ఈ సేవను ఉపయోగిస్తున్నట్లయితే, మీ స్పాటిఫై ఖాతాను చాట్‌జీపీటీకి కనెక్ట్ చేయమని అడుగుతుంది. ఈ అనుసంధానం పూర్తిగా ఆప్ట్-ఇన్ ద్వారా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కనెక్ట్ చేయవచ్చు లేదా డిస్‌కనెక్ట్ చేయవచ్చు, పూర్తి నియంత్రణ మీ చేతుల్లోనే ఉంటుంది.
3. సిఫార్సు అడగడం: ఆ తర్వాత, మీరు నేరుగా పాటలు, ఆర్టిస్ట్‌లు, ఆల్బమ్‌లు, ప్లేలిస్ట్‌లు లేదా పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లను అడగవచ్చు.
4. ఆటోమేటిక్ ప్లే: చాట్‌జీపీటీ మీరు అడిగిన సందర్భాన్ని ఆటోమేటిక్‌గా గ్రహించి, స్పాటిఫై యాప్‌ను చాట్‌లో ఓపెన్ చేస్తుంది. కావాల్సిన పని పూర్తి చేస్తుంది.
5. వివరాలు చెప్పాలి: మీరు మెరుగైన ఫలితాలు రావాలంటే, మీ అభ్యర్థనలకు జానర్ (genre), మూడ్ (mood), లేదా ఆర్టిస్ట్ వంటి వివరాలు ఇవ్వాలి. పాడ్‌కాస్ట్‌ల కోసం అయితే, ఒక అంశం (topic), హోస్ట్, లేదా అతిథి పేరు జత చేయవచ్చు.
ఉదాహరణకు, మీరు లాంగ్ డ్రైవ్‌కు వెళ్తున్నారు. అప్పడు చాట్‌జీపీటీతో మాట్లాడి స్పాటిఫైను పిలిచి లాంగ్ డ్రైవ్‌కు సరిపోయే పెర్‌ఫెక్ట్ సౌండ్ ట్రాక్ ఇవ్వమని అడగాలి. మీకు ఇష్టమైన కె-పాప్ స్టార్ నుంచి కొత్త పాటలు కావాలన్నా, లేదా మీరు ఎక్కువగా వినే స్వదేశీ, విదేశీ ఆర్టిస్ట్‌ల ప్లేలిస్ట్ కావాలని కూడా అడగవచ్చు.
ప్రీమియం వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు:
స్పాటిఫై ఈ సేవను అందించడంలో ఫ్రీ, ప్రీమియం వినియోగదారుల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దీని ద్వారా ప్రీమియం వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తోంది.
• స్పాటిఫై ఫ్రీ యూజర్‌లు స్పాటిఫై కేటలాగ్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 'వీక్లీ డిస్కవర్ ' 'న్యూ మ్యూజిక్ ఫ్రైడే' వంటి ప్లేలిస్ట్‌లను మాత్రమే పొందగలుగుతారు.
• స్పాటిఫై ప్రీమియం యూజర్‌లు ఒక అడుగు ముందుకు వేయవచ్చు. వారు ఇచ్చే మరింత విస్తృతమైన ప్రాంప్ట్‌లను తీసుకుని, స్పాటిఫై వాటిని ఫ్రెష్ ఫుల్ పర్సనలైజ్డ్ ట్రాక్‌లను ఎంపిక చేస్తుంది.
భద్రతపై హామీ:
ఈ కొత్త అనుసంధానం స్పాటిఫై వేదికపై ఉన్న ఆర్టిస్ట్‌లు పాడ్‌కాస్టర్‌లకు 'డిస్కవరీకి కొత్త వేదిక'గా నిలుస్తుంది. ఈ సేవ విస్తృతంగా అందుబాటులోకి రావడం వల్ల, వినియోగదారులు వారు ఇష్టపడే కొత్త వాటిని కనుగొనడానికి ఇది సరికొత్త మార్గం అవుతుంది. అయితే, వినియోగదారులు, క్రియేటర్స్ భద్రతకు గట్టిగా భరోసా ఇచ్చింది స్పాటిఫై. స్పాటిఫై తమ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సంగీతం, పాడ్‌కాస్ట్‌లు లేదా ఏదైనా ఇతర ఆడియో లేదా వీడియో కంటెంట్‌ను ఇతర OpenAIతో పంచుకోదని స్పష్టం చేసింది. ఈ స్పాటిఫై యాప్ ప్రస్తుతం లాగిన్ అయిన ChatGPT ఫ్రీ, ప్లస్, ప్రో ఖాతాలన్నింటికీ 145 దేశాలలో అందుబాటులోకి వచ్చింది. ఇది వెబ్, మొబైల్ రెండింటిలోనూ పనిచేస్తుంది.